రికార్డుల్లో ఇప్పటి వరకూ ప్రభుత్వ భూమి.. త్వరలో మారే అవ
టీడీపీ నేతలు కబ్జా చేస్తున్న పొలం ఎల్పీ నెంబర్ 1725. ఖాతా నెంబర్ 200019 సర్వేనెంబర్ 369–1ఏ, 369–5 పరిధిలోని మొత్తం 11.34 ఎకరాల భూమి స్వభావం ‘ప్రభుత్వ భూమి, కేటాయించని ప్రభుత్వ భూమి’ అని అడంగల్‌లో ఉంది. భూమి వినియోగ తీరు కూడా వ్యవసాయేతర అని, పట్టాదారుని పేరు మిగులు భూమి, అనుభవ స్వభావం ప్రభుత్వ భూమి అని స్పష్టంగా రికార్డుల్లో కనిపిస్తోంది. ఇంతటి విలువైన భూమిని ఇటు అధికారులు, అటు టీడీపీ నేతలు కలిసి దోచుకునేందుకు రంగం సిద్ధమైంది. మరి ఈ విషయం ఆర్డీఓకు తెలుసా? తెలియదా? అనేది తీసుకునే చర్యలపై ఆధారపడి ఉంటుంది. ఇకపోతే ఇంత విలువైన భూమిని కబ్జా చేస్తున్నారంటే అధికాపార్టీ నియోజకవర్గ ప్రజాప్రతినిధులకు తెలియకుండా ఉంటుందా? వారి అనుమతి లేకుండానే కిందిస్థాయి నేతలు ఇంత సాహసానికి ఒడిగడతారా? ఒక వేళ తెలిసీ ఇప్పటి వరకు మౌనం వహించారంటే వాళ్లకు కూడా ఈ భూ దందాలో భాగం ఉందా? అనే చర్చ కొనసాగుతోంది.
ప్రభుత్వ భూమికి సంబంధించి
భూకమత పటం


