ఈ ఏడాది కేవలం పశువుల షెడ్లే!
2025–26 సంవత్సరానికి సంబంధించి పల్లె పండకు–2 చేపట్టడానికి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రంగం సిద్ధం చేశారు. నిధులు విడుదల కానందున ఈ ఏడాది సీసీ రోడ్లకు మంగళం పలికారు. ఈ ఏడాది ఒక్క సీసీ రోడ్డుకు కూడా అవకాశం లేకుండా పోయింది. పశువుల షెడ్లు మాత్రం నిధులు మంజూరు చేస్తామని చెబుతున్నారు. 2024–25లో మంజూరు చేసి నిర్మించుకోని వాటితో పాటు 2025–26 సంవత్సరానికి సంబంధించి ఉమ్మడి జిల్లాలో మొత్తం 2,600 పశువుల షెడ్లు మంజూరు చేయతలపెట్టారు. అయితే పశువుల షెడ్లు నిర్మించుకోవడానికి ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. అయితే పనులు మంజూరు చేయాలని, వేగవంతం చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్, గ్రామీణాభివృధ్ధి శాఖ ఉన్నతాధికారులు.. డ్వామా అధికారులపై ఒత్తిడి పెంచుతున్నారు.


