ఆశలు కుళ్లిపోతున్నాయి!
కోడుమూరు రూరల్: మంచి ధర వస్తుందని ఎన్నో ఆశలతో ఉల్లి సాగు చేసిన రైతుకు కన్నీరే మిగిలింది. మార్కెట్‌లో ధర లేక కొందరు పొలాల్లోనే పంటను పశువులు, గొర్రెలకు వదిలేశారు. మరికొందరు ట్రాక్టర్‌తో దున్నేశారు. ఇప్పుడు వర్షం కురుస్తూ రైతుల ఆశలపై నీళ్లను చల్లింది. కోడుమూరు మండలం వర్కూరుకు చెందిన ఓ రైతు ఉల్లి దిగుబడులను కల్లందొడ్డిలో ఆరబెట్టాడు. గత రెండు రోజులుగా వానలు పడుతుండడంతో అవి కుళ్లిపోయాయి. అలాగే బైన్‌దొడ్డి గ్రామంలో వర్షాలకు దిగుబడులను మార్కెట్‌కు తరలించలేక ఓ రైతు కల్లందొడ్డిలో అలాగే వదిలేశాడు. దీంతో ఉల్లి గడ్డలు మరింత కుళ్లిపోతున్నాయి.


