
మోదీ పర్యటనతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు
● సమస్యలను వివరించడంలో సీఎం, డిప్యూటీ సీఎం విఫలం ● సీపీఎం, సీపీఐ నాయకుల విమర్శ
కర్నూలు(సెంట్రల్) : ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్నూలు పర్యటనతో రాష్ట్రానికి రూ.350–400 కో ట్లు ఖర్చు వృథా తప్పా ఒరిగిందేమీ లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి డి.గౌస్‌దేశాయ్ విమర్శించారు. రాష్ట్ర సమస్యలను ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పనవ్ కల్యాణ్ విఫలమ్యారన్నారు. శుక్రవారం సుందరయ్య భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సూపర్ జీఎస్టీ..సూపర్ సేవింగ్స్ అంటూ సభలో చంద్రబాబునాయుడు, లోకేష్ మోదీ భజన చేశారని, చంద్రబాబు 25 సార్లు, లోకేష్ తండ్రిని మించిన తనయుడిగా 35 సార్లు మోదీ జపం చేశారన్నారు. రాష్ట్రానికి ప్రధాన మంత్రి వచ్చారంటే అభివృద్ధి పనులకు నిధులను డిమాండ్ చేయాల్సి ఉన్నా ఆ పని చేయలేదన్నారు. విశాఖ స్టీలు ప్లాంటును బలోపేతం చేశామని తండ్రి, కొడుకులు చెప్పుకోవడం ప్రజలను మోసం చేయడమే అవుతుందన్నారు. పార్లమెంట్ సాక్షిగా విశాఖ స్టీలు ప్లాంటును ప్రైవేటీకరణ చేస్తామని స్వయంగా మోదీనే చెప్పింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పీఎస్ రాధాకృష్ణ, జి.రామకృష్ణ, ఎండీ ఆనంద్‌బాబు, టి.రాముడు, ఎండీ అంజిబాబు, ఓల్డ్‌సిటీ కార్యదర్శి రాజశేఖర్ పాల్గొన్నారు.
విభజన హామీల ప్రస్తావన ఏదీ..?
కర్నూలులో జరిగిన మోదీ సభలో విభజన హామీల ప్రస్తావన లేకపోవడం తీవ్ర అన్యాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె.రామాంజనేయులు శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, అత్యంత వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, సాగునీటి ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు విషయాలపై ఎవరూ మాట్లాక పోవడం మోసం చేయడమేనన్నారు. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు ఒకరినొకరు పొగుడుకోవడానికే సభను నిర్వహించినట్లు ఉందన్నారు. అధికార దుర్వినియోగంతో భయపెట్టి పొదుపు, జీ ఎస్టీ వ్యాపారులు, ఉపాధి కూలీలను సభకు రప్పించా రని విమర్శించారు. అధికారంలోకి వస్తే న్యాయం చే స్తామని సుగాలి ప్రీతిభాయ్ కుటుంబానికి హామీ ఇచ్చి న పవన్ కల్యాన్..సుగాలి పార్వతీని బయటకు రాకుండా గృహ నిర్భంధం చేయడం దారుణమన్నారు.