
విద్యార్థుల అప్పగింత
మంత్రాలయం రూరల్: దారి తప్పి మంత్రాలయం చేరుకున్న బెంగళూరు సిటీ క్రైస్ట్ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులను పోలీసులు శుక్రవారం తల్లిదండ్రులకు అప్పగించారు. బెంగళూరుకు చెందిన మోహన్‌కుమార్ కుమారుడు విశాల్‌కుమార్ (8వ తరగతి), చిన్నప్ప కుమారుడు రంజిత్ (8వ తరగతి), మోహన్‌కుమార్ కుమారుడు తనీష్ (8వ తరగతి) కర్ణాటకలోని ధర్మస్థలం, మద్రాసు ప్రాంతాలను చూడాలని ఇంట్లో చెప్పకుండా.. అయితే ఏ బస్సు ఎక్కడికి పోతుందో తెలియకుండా మంత్రాలయం బస్సు ఎక్కారు. శుక్రవారం ఉదయం రాఘవేంద్ర సర్కిల్‌లో ఏడుస్తున్న విద్యార్థులను స్థానిక కానిస్టేబుల్ నాగేశ్వరరెడ్డి గమనించి స్టేషన్ తీసుకెళ్లారు. వివరాలు రాబట్టిన ఎస్‌ఐ శివాంజల్ తల్లిదండ్రులకు సమాచారం చేరవేసి తండ్రులు రాగానే పిల్లలను వారికి అప్పగించారు.