
లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విధులపై సమీక్ష
కర్నూలు(సెంట్రల్): లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విధులపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి సమీక్షించారు. ఆయన శుక్రవారం న్యాయ సేవాసదన్‌లో సమీక్ష చేస్తూ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ విధులు, చట్టపరమైన సలహాలు, జైళ్ల పర్యటనలు, కేసుల వివరాలు, పరిష్కారాలపై అధికారులకు వివరించారు. పలు కేసులకు సంబంధించి బెయిళ్లు ఇచ్చిన స్థితిగతులపై సమీక్షించారు. డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ శివరాం, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ ఏ.సులోచన పాల్గొన్నారు.