
ఫోన్ మాట్లాడుతూ కుప్పకూలిన యువకుడు
● గుండెపోటుతో బీటెక్ విద్యార్థి మృతి
ఎమ్మిగనూరురూరల్: ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ కాలేజీలో గురువారం మధ్యాహ్నం గుండె పోటుతో ఓ బీటెక్ విద్యార్థి హఠాన్మరణం చెందాడు. పట్టణంలోని ముగతి పేటకు చెందిన ఫారూక్, రెహెనాబానుల కుమారుడు అబ్దుల్‌రహీమాన్ (22) బీటెక్–సీఎస్‌బీ నాల్గవ సంవత్సరం చదువుతున్నాడు. మధ్యాహ్నం భోజనం చేసి చెట్టు కింద ఫోన్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి విద్యార్థులు వెంటనే చికిత్స కోసం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గుండెపోటుతో మృతి వలనే మృతి చెందినట్లు చెప్పారు. కాగా ఇదే రోజు గాజులదిన్నె వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఎర్రకోట సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన ఓ విద్యార్థి మృతి చెందడం, మరో విద్యార్థి గల్లంతు కావడం, ఇంకో విద్యార్థి గుండెపోటుతో మృతి చెందడంతో కళాశాలలో విషాదం అలుముకుంది.