
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం
● ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి
ఆస్పరి: రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని ఆలూరు ఎమ్మెల్యే బుసినె విరూపాక్షి అన్నారు. ఆస్పరిలో శుక్రవారం కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలనే ప్రయత్నం కూటమి సర్కార్ చేస్తోందన్నారు. పేదలకు ఉచిత వైద్యం అందుబాటులో లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వకూడదన్నారు. ఈవిషయంపై ప్రజల్లో అవగాహన కల్పించి గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఉధృతం చేస్తామన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ బసవరాజు, ఆ పార్టీ నాయకులు గోవర్ధన, రామాంజనేయులు, రాధాకృష్ణ, వెంకటేష్, పాండు, అశోక్, తిమ్మప్ప, ఉసేని, వేణుగోపాల్, రాజన్న గౌడ్, కౌలుట్లయ్య, నాయుడు తదితరులు పాల్గొన్నారు.