
వెల్ఫేర్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పాటు
కర్నూలు(అర్బన్): జిల్లాలోని ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలకు చెందిన ఉద్యోగులందరు వారి సంక్షేమం కోసం నూతనంగా వెల్ఫేర్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేసుకున్నారు. బుధవారం ఆయా శాఖలకు చెందిన అధికారులు, ఉద్యోగులందరు స్థానిక అంబేడ్కర్ భవన్‌లో సమావేశమై అసో సియేషన్ నూతన కార్యవర్గాన్ని కూడా ఎన్నుకున్నా రు. ఆయా శాఖలకు చెందిన జిల్లా అధికారులను గౌరవాధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అలాగే అధ్యక్షులుగా కర్నూలు సాంఘిక సంక్షేమ సహాయ అధికారి బి. మద్దిలేటి, ప్రధాన కార్యదర్శిగా బీసీ వసతి గృహ సంక్షేమాధికారి పి. శ్రీనివాసులు, కోశాధికారిగా ట్రైబల్ హెచ్‌డబ్ల్యూఓ ఎం. ఓబులేసును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలోనే అసోసియేట్ ప్రెసిడెంట్లుగా కె. బాబు ( ఏఎస్‌డబ్ల్యూఓ పత్తికొండ),ఎం శ్రీనివాసులు ( ఏబీసీడబ్ల్యూఓ ఎమ్మిగనూ రు ), టి. ఆంజనేయులు నాయక్ ( ఏబీసీడబ్ల్యూఓ కర్నూలు అర్బన్), ఎస్ లీలావతి ( ఏఎస్‌డబ్ల్యూఓ కోడుమూరు ), పి. మాదప్ప ( ఏబీసీడబ్ల్యూఓ ఆదోని ) ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా వసతి గృహ సంక్షేమాధికారులు జి. రాముడు, పి. సత్యనారాయణరాజు, జి. సుంకన్న, డీసీ మదారి, ఎం. నాగమద్దయ్యతో పాటు కార్యాలయ పర్యవేక్షకులు పి. మనోహర్ ఎన్నికయ్యారు. ఆర్గనైజింగ్ సెక్రెటరీలుగా పర్యవేక్షకులు ఎస్ ఆలీబాషా, హెచ్‌డబ్ల్యూఓలు యు. కల్పన, సి. విశళ్వనాథరెడ్డి, కె. రాజశేఖర్‌రెడ్డి, సి. సిద్దప్ప, పి. సుంకన్న, సంయుక్త కార్యదర్శులుగా కె. హారతీదేవి, జి. రవికుమార్, ఇమ్మానుయేల్, కె. రంగస్వామి, బి. బెన్నమ్మ, ఎస్ వెంకటరాముడుతో పాటు 13 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకున్నారు.