మంత్రాలయం: అన్నదాత సుఖీభవ మాట దేవుడెరుగు. రాఘవేంద్రుడి సాక్షిగా.. అధికారుల ఎదుట తెలుగు తమ్ముళ్లు తాగి తూగారు. మత్తులో జోగుతూ సభా స్థలిలో హంగామా చేశారు. నిండు సభ జరుగుతున్న సమయంలో ఓ కార్యకర్త ఏకంగా స్టేజీపైకి ఎక్కి తాగిన మైకంలో ఈలలు వేశాడు. అదే వ్యక్తి వక్తలు ప్రసంగిస్తున్న సమయంలో స్టేజీ వైపు తూలుతూ పోతుండగా పోలీసులు వారించి నెట్టివేశారు. విచిత్రమేంటంటే క్షేత్రం పవిత్రతను మరిచి తమ్ముళ్లు నడుచుకోవడం స్థానికుల్లో చర్చగా మారింది. అంతేకాదండోయ్.. ఇక్కడ మరీ ముఖ్యంగా నాటుసారా టిన్‌లు సైతం దర్శనమిచ్చాయి. కొందరు టిన్‌లలో నాటుసారా తెచ్చుకుని ఏకంగా రెవెన్యూ కార్యాలయం ఎదుటే తాగుతూ కానిచ్చారు. మరికొందరు కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు తెచ్చుకుని ఫూటుగా తాగారు. ఓ కార్యకర్త ఏకంగా జాతీయ రహదారిపై పడుకుని వాహనాలకు అంతరాయం కల్గించాడు. టీడీపీ కార్యకర్తలు తూలడం చూసి స్థానికులు విస్తుపోయారు.
తాగి తూగిన ‘తెలుగు తమ్ముళ్లు’
తాగి తూగిన ‘తెలుగు తమ్ముళ్లు’