
గిరిజన విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?
పాణ్యం: గురకుల పాఠశాలలో సౌకర్యాలు కల్పించకుండా గిరిజన విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా మండిపడ్డారు. పాణ్యం మండలం నెరవాడ మెట్ట వద్ద ఉన్న గిరిజిన గురుకుల(బాలుర)పాఠశాలలో ఫుడ్‌పాయిజన్‌తో 25 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ అక్కడికి వెళ్లారు. ప్రిన్సిపాల్ క్రిస్ణానాయక్‌తో మాట్లాడారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ.. పాఠశాలలో 228 మంది విద్యార్థులు ఉన్నారని, వీరికి సురక్షిత మంచినీరు అందించాల్సిన ఆర్‌ఓ ప్లాంట్ మూలనపడిందన్నారు. నిధులు లేక మరమ్మతులు చేయలేదన్నారు. డైనింగ్‌హాల్ లేకపోవడంతో విద్యార్థులు ఆరుబయట బురదలో నిలబడి భోజనం చేయాల్సి వస్తోందన్నారు. వంట గదిలో ఒక్కరు కూడా పర్మినెంట్ వర్కర్ లేరని, ఇతర హోటల్‌లో వంట చేయిస్తున్నారన్నారు. పాఠశాలలో వైద్య సిబ్బంది అందుబాటులో లేరని, మాత్రలు కూడా లేవన్నారు. సౌకర్యాలు కల్పించకుండా గిరిజన విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగామాడుతోందని విమర్శించారు. ఇదిలా ఉండగా పాఠశాల వద్ద విద్యార్థి సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. ప్రిన్సిపాల్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐఎఫ్‌బీ వెంకటాద్రి, ఎన్‌ఎస్‌యూఐ ప్రతాప్, ఎఐవైఎల్ చిరంజీవి, ఎపీఎస్‌ఎఫ్ సురేంద్ర, ఆర్‌విఎఫ్ రవీంద్ర పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఇసాక్‌బాషా