
కర్నూలుకు నీటి సమస్య తలెత్తనీయొద్దు
కల్లూరు: కర్నూలు నగరానికి నీటి సమస్య తలెత్తకుండా హంద్రీ– నీవా ప్రధాన కాల్వ నుంచి గాజులదిన్నె ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ డీఈని జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా ఆదేశించారు. కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామం వద్ద హంద్రీ–నీవా కాలువ విస్తరణ పనులను బుధవారం కలెక్టర్ పరిశీలించారు. నీటి విడుదల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా హంద్రీ–నీవా కాలువ నీటితో 68 చెరువులను నింపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణగిరి, పత్తికొండ రిజర్వాయర్‌తో పాటు అన్ని తూముల ద్వారా ఆయకట్టుకు నీటిని ఇవ్వాలన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ఇన్‌చార్జ్ ఈఈ ప్రసాద్‌రావు, డీఈఈ కొండన్న, చెన్నయ్య, తహసీల్దార్ ఆంజనేయులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా