శ్రావణం వచ్చింది.. పండగలు తెచ్చింది | - | Sakshi
Sakshi News home page

శ్రావణం వచ్చింది.. పండగలు తెచ్చింది

Jul 25 2025 4:31 AM | Updated on Jul 25 2025 4:31 AM

శ్రావ

శ్రావణం వచ్చింది.. పండగలు తెచ్చింది

కర్నూలు కల్చరల్‌/కోవెలకుంట్ల/గడివేముల: శ్రావణ మాసం శుభదాయకమైంది. ప్రతి రోజు అత్యంత ప్రవిత్రమైందే. అత్యఽధిక పండుగలను ఈ మాసంలోనే జరుపుకుంటాం. నాగులచవితి, వరలక్ష్మీ వ్రతం, రాఖీపౌర్ణమి, శ్రీకృష్ణాష్ఠమి ఇలా హిందువులకు అత్యంత ముఖ్యమైన ఈ పండుగలు బంధాలు, భాందవ్యాలను తెలుపుతాయి. శ్రావణ మాసం అంటే చంద్రుడు శ్రావణా నక్షత్రంలోకి అడుగు పెట్టిన మాసం. నక్షత్రాల్లో శ్రావణా నక్షత్రం చాలా శుభదాయకం. అలాగే మాసాల్లో శ్రావణ మాసం మహా మహిమాన్వితం. ఎందుకంటే మిగతా మాసాల్లో కొన్ని తిఽథులు మాత్రమే శుభకరమైనవి. కావున శ్రావణ మాసంలో అన్ని తిథులు పవిత్రమైనవని చెప్పవచ్చు. విష్ణుమూర్తి నక్షత్రం కూడా శ్రవణా నక్షత్రమే. ఈనెలలో విష్ణుమూర్తి నక్షత్ర మండలంలో కొలువుదీరి ఉండటాన నభోమాసం అంటారు. శ్రావణ మాసం ఎంతో ఉత్కృష్టమైంది. మన సంస్కృతి సంప్రదాయాల్లో ఈనెల ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. రుతువులలో మూడోదైన వర్ష రుతువు ఈమాసంతోనే ప్రారంభమవుతుంది. వ్యవసాయ పరంగా కూడా ఈమాసం ప్రాముఖ్యం పొందింది. శ్రావణంలో గృహ నిర్మాణాన్ని ప్రారంభించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని మత్స్య పురాణం చెబుతోంది. శ్రావణ మాసం శుక్రవారం ప్రారంభం కానుంది.

శ్రావణ మాసంలో వచ్చే పండుగలు..

● శ్రావణ మాసంలో ఆచారించాల్సిన వ్రతాల్లో సోమవార వ్రతం ఎంతో విశిష్టమైంది. ఈ రోజున (ఈనెల 28, ఆగస్టు 4, 11, 18 తేదీలు) శివుని ప్రీత్యర్థం ఉపవాసం ఆచరించడంతో మంచి ఫలితాలను పొందవచ్చని వేద పండితులు చెబుతున్నారు.

● ఈ మాసంలో మరొక విశేషం ఏమిటంటే కొత్తగా పైళ్లెన సీ్త్రలు ప్రతి మంగళవారం (29, ఆగస్టు 5, 12, 19 తేదీలు) మంగళ గౌరి వ్రతాన్ని నోచుకుంటారు. ఒక రాజకుమార్తె తన వైధవ్యాన్ని తొలగించుకోడానికి ఈ వ్రతము ఆచరించిందని పురాణాల ద్వారా తెలుస్తుంది.

● శ్రావణ శుక్రవారాలు లక్ష్మీ పూజకు అత్యంత ముఖ్యమైనవి.

● శావణ మాసంలోని మొదటి పండుగ నాగుల చవితి. దక్షప్రజాపతికి చిన్న భార్య అయిన కద్రువకు జన్మించిన సంతతే నాగజాతి. సుబ్రహ్మణ్య స్వామి ప్రతి రూపాలు. ఈ జాతిని పూజిస్తే సంతానప్రాప్తి కలుగుతుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. ఇది పున్నమి ముందు అనగా శ్రావణమాసం ప్రార ంభమైన (28వ తేదీ) నాలుగవ రోజు వస్తుంది.

● మరుసటి రోజు ఆగస్టు (29వ తేదీ) గరుడ పంచమి. అనగా వినత కుమారుడు గరుత్మంతుడు తన తల్లి దాస్యము బాపుటకు స్వర్గానికి వెళ్లి అమృతం తెచ్చి కద్రువ సంతానమైన పాములకు పోసి దాస్య విముక్తి చేస్తాడు. గరుత్ముంతుని జన్మదినమైన గరుడ పంచమి నోమును నోచుకుంటారు. పార్వతీదేవిని ‘ఫణిగౌరి’తో పోల్చుకుని నోచుకొని తమ సోదరుల వద్దకు వెళ్లి వారి ఆశీస్సులు అందుకుంటారు.

● ఈ మాసంలో అతి ముఖ్యమైన పండుగ ‘వరలక్ష్మి వ్రతం’. ఆగస్టు 8వ తేదీ ఈ పర్వదినాన్ని జరుపుకుంటారు. ఈ వ్రతాన్ని పార్వతీ దేవికి పరమేశ్వరుడే స్వయంగా చెప్పాడని శివపురాణం ద్వారా తెలుస్తుంది. ఈ వ్రతం శ్రావణ మాసం రెండవ శుక్రవారం వస్తుంది.

● తరువాత ముఖ్య మైంది ‘శ్రావణ పూర్ణిమ’. దీనినే ‘రాఖీ పూర్ణిమా’ అంటారు. 9వ తేదీన రక్షా బంధన్‌ జరుపుకుంటారు. ఇదే రోజు హయగ్రీవ జయంతిని నిర్వహిస్తారు.

● మరొక ముఖ్యమైన పండుగ కృష్ణాష్టమి. ఇది శ్రావణమాసం కృష్ణ పక్షంలో అష్టమి రోజు (16వ తేదీ) వస్తుంది. శ్రీకృష్ణుడు దేవకీ, వసుదేవులకు అష్టమ గర్భంగా అర్ధ్దరాత్రి జన్మించిన పర్వదినం. గీతాచార్యుడు అయిన శ్రీకృష్ణపరమాత్ముని జన్మదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఈ పండుగను అందరూ భక్తి శ్రద్ధలతో చేసుకుంటారు.

శ్రావణ మాసం అత్యంత పవిత్రం

శ్రావణ మాసం అత్యంత పవిత్రం, శుభకరం. ఈ మాసంలో ప్రతిరోజు పండుగే. సకలదేవతారాధనకు అనుకూలమైంది. మహిళలు ఈ మాసంలో ఉపవాసం ఉండి వివిధ రకాల నోములు, వ్రతాలు ఆచరిస్తారు. ముఖ్యంగా అన్నాచెల్లెళ్ల బంధాన్ని బలోపేతం చేసే రాఖీ పౌర్ణమి, శుక్రవారాల్లో లక్ష్మీ దేవిని సేవిస్తూ వరలక్ష్మీ వ్రతాన్ని నోమి సకల సుఖాలు కలగాలని వేడుకుంటారు. అత్తలు తమ కొత్త కోడళ్ల ఇంటికెళ్లి కొబ్బరి బెల్లం, నువ్వులు, ప్యాలపిండిని ఇచ్చి యోగ క్షేమాలు తెలుసుకుంటారు. – అగ్రహారం రాఘవేంద్ర ఆచార్యులు, పండితులు

నేటి నుంచి శ్రావణ మాసం ప్రారంభం

పండుగల సమాహారంతో

ఆధ్యాత్మిక శోభ

శ్రీశైలం, ఉరుకుంద క్షేత్రాల్లో

ప్రత్యేక ఉత్సవాలు

కొనసాగనున్న సామూహిక వ్రతాలు

శ్రీశైలంలో..

శ్రావణ మాసంలో శ్రీశైల మహా క్షేత్రంలో 25వ తేదీ నుంచి నెలంతా విశేష పూజాధికాలు, ప్రత్యేక ఉత్సవాలు నిర్వహించనున్నారు. శ్రావణ సోమవారాలు, శుక్రవారాలు, శనివారాలు, ఏకాదఽశులు, శ్రావణ పౌర్ణమి, మాసశివరాత్రి, తదితర కార్యక్రమాలు జరుగుతాయి. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఉరుకుందలో..

ఉరుకుంద నరసింహ ఈరన్న స్వామి దేవస్థానంలో నెలంతా శ్రావణ మాసోత్సవాలు జరగనున్నాయి. సోమ, గురువారాలు స్వామివారికి ప్రత్యేక రోజులు కావున ఆయా రోజుల్లో విశేష పూజలు నిర్వహిస్తారు. నాల్గవ సోమవారం 18వ తేదీన స్వామివారికి పల్లకి ఉత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

కర్నూలు ఓల్డ్‌ సిటీలోని చిన్న అమ్మవారి శాల, పెద్ద అమ్మవారి శాల, లలితా పీఠం, నిమిషాంబదేవి ఆలయం, కాళికాంబ ఆలయం, వీఆర్‌ కాలనీ, కృష్ణానగర్‌, సంకల్‌ బాగ్‌లలోని వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

శ్రావణం వచ్చింది.. పండగలు తెచ్చింది1
1/3

శ్రావణం వచ్చింది.. పండగలు తెచ్చింది

శ్రావణం వచ్చింది.. పండగలు తెచ్చింది2
2/3

శ్రావణం వచ్చింది.. పండగలు తెచ్చింది

శ్రావణం వచ్చింది.. పండగలు తెచ్చింది3
3/3

శ్రావణం వచ్చింది.. పండగలు తెచ్చింది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement