
విష గుళికలు చల్లుతూ..
● 11 మంది కూలీలకు అస్వస్థత
ఆదోని అర్బన్: హొళగుంద మండలం చిన్నగోనేహాల్ గ్రామంలో మొక్క జొన్న పంటకు విష గుళికలు చల్లుతూ గురువారం 11 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులు తెలిపిన వివరాలు.. చిన్నగోనేహాల్ గ్రామంలో 10 ఎకరాల మొక్కజొన్న పంటకు 11 మంది కూలీలు విషగుళికలు చల్లుతుండగా అందులో రంగస్వామి, నాగరాజులు వాటి వాసన పీల్చి వాంతులు అయ్యి అస్వస్థతకు గురయ్యారు. దీంతో మిగతా 9 మందికి కూడా వాటి వాసనకు గురవుతారని తెలుసుకుని వెంటనే వారిద్దరితో పాటు మరో 9 మందిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎలాంటి ప్రాణాపాయం లేకుండా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
తల్లిదండ్రులకు బాలుడి అప్పగింత
శ్రీకాళహస్తి: సెల్‌ఫోన్ కొని ఇవ్వలేదని 15 రోజుల క్రితం ఇంటి పారిపోయిన కిరణ్(15)ను పోలీసులు గురువారం అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. శ్రీకాళహస్తి రెండో పట్టణ సీఐ నాగార్జునరెడ్డి కథనం మేరకు.. డోన్‌కు చెందిన కిరణ్ అనే బాలుడు సెల్‌ఫోన్ కొని ఇవ్వలేదన్న కోపంతో ఇంటి నుంచి 15 రోజుల క్రితం వచ్చేశాడు. రెండు రోజుల క్రితం అదిలాబాద్ నుంచి తిరుపతికి వెళుతున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో ఓ టీవీ రిపోర్టర్ గుర్తించి, అతడి వద్ద వివరాలు ఆరా తీసింది. దీంతో శ్రీకాళహస్తి రెండో పట్టణ పోలీసులకు గురువారం అప్పగించాడు. పోలీసులు విచారణ జరిపి డోన్‌కు చెందిన బాలుడిగా గుర్తించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి, వారిని పిలిపించి, విద్యార్థికి కౌన్సెలింగ్ ఇచ్చి వారికి అప్పగించారు.

విష గుళికలు చల్లుతూ..