
‘నీ అంతు చూస్తా.. విధుల నుంచి తొలగిస్తా’
కౌతాళం: ‘నీ అంతు చూస్తా.. నిన్ను విధుల నుంచి తొలగిస్తా’ అని ఉరుకుంద ఈరన్న స్వామి దేవాలయ డిప్యూటీ కమిషనర్ విజయరాజు తనను కించపరిచేలా మాట్లాడారని ట్రాన్స్‌కో ఏఈ నర్సన్న ఆదోని సబ్ కలెక్టర్‌కు మౌర్య భరద్వాజ్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నర్సన్న విలేకరులతో మాట్లాడుతూ.. ఈరన్న స్వామి శ్రావణమాస ఉత్సవాల ఏర్పాట్లల్లో భాగంగా భక్తుల సౌకర్యార్థం విద్యుత్ పనులు చేపడుతున్నామన్నారు. అయితే ఈఓ చులకనగా మాట్లాడటం ఏమిటని ప్రశ్నించా రు. ఈఓపై కౌతాళం పోలీసులకు ఫిర్యా దు చేసేందుకు వెళితే కేసు తీసుకోలేదన్నారు. జరిగిన ఘటనను తమ శాఖ అధికారులకు తెలిపి తమశాఖ అధికారులతో కలిసి ఆదోని సబ్‌కలెక్టర్‌కు బుధవారం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. కళ్యాణ కట్ట వద్ద విద్యుత్ స్తంభాలను మార్చాలని ఈఓ ఆదేశించారని, ఆ స్తంభాలు మార్చాలంటే ఎస్టిమేట్ వేయాలని తెలిపినా వినిపించుకోకుండా అనుచితంగా ప్రవర్తించారన్నారు. ఆలయ ఈఓపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
కించపరిచేలా మాట్లాడిన
ఉరుకుంద ఆలయ ఈఓ
సబ్‌కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన
ట్రాన్స్‌కో ఏఈ