
అడ్డంకులు ఉన్నా కేసీకి నీరు విడుదల!
కర్నూలు సిటీ: కర్నూలు–కడప కాలువ (కెసీ కెనాల్)లో చెత్తాచెదారం పేరుకుపోయి ఉన్నా, అడ్డుగా మట్టి కుప్పలు ఉన్నా కనీస చర్యలు తీసుకోకుండా ఆదివారం సుంకేసుల జలాశయం నుంచి సాగు నీటిని విడుదల చేశారు. దీంతో కేసీ కెనాల్‌లో నీటి ప్రవాహానికి అడ్డంకులు ఎదురొచ్చాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల సాగు నీటి సలహా మండలి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయం మేరకు సుంకేసుల బ్యారేజీ దగ్గర ఆదివారం ఉదయం ప్రత్యేక పూజలు చేసి కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు బొగ్గుల దస్తగిరి, జయసూర్య, కేసీ కెనాల్ డీఈఈ ఎన్.ప్రసాద్ రావులు మోటర్ ఆన్ చేసి కేసీకి నీటిని విడుదల చేశారు. తొలుత 500 క్యుసెక్కుల నీటిని విడుదల చేసి, రాత్రి 7 గంటలకు మరో 250 క్యుసెక్కులు, సోమవారం నుంచి రెండు, మూడు రోజుల్లోనే 2500 క్యుసెక్కులకు నీటి విడుదలను పెంచనున్నట్లు కేసీ ఇంజినీర్లు చెబుతున్నారు.
వైఎస్సార్‌సీపీ ఆందోళనలతోనే..
జిల్లాలో ఆశించిన స్ధాయిలో వర్షాలు లేవు. ఎగువన కురిసిన వర్షాలతో కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు భారీగా వరద వచ్చింది. డ్యాం నుంచి తుంగభద్ర నదికి నీటిని విడుదల చేసినా, సుంకేసుల జలాశయానికి భారీగా నీరు వచ్చిన కేసీ కెనాల్‌ల్‌కు చుక్క నీరు కూడా విడుదల చేయలేదు. ఎగువ నుంచి వచ్చిన నీరంతా దిగువకు విడుదల చేసేశారు. ఆసమయంలోనైనా కేసీ కెనాల్‌లో అడ్డంకులను తొలగించలేదు. వైఎస్సార్‌సీపీ ఆందోళనలతో కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు కేసీకీ నీటిని విడుదల చేసింది.
నీటి ప్రవాహానికి ఇవీ అడ్డంకులు..
● కర్నూలు–కడప కాలువ కర్నూలు నగరం మధ్యలో వెళ్తుంది. కాలువలో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించేందుకు మొదట రూ.62 లక్షలతో అంచనాలు వేశారు. ఈ పనులు నామినేషన్‌పై చేసేందుకు సాధ్యం కాకపోవడంతో టీడీపీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు అంచనాలను తగ్గించారు.
● నామినేషన్‌పై పనులు చేసేందుకు రూ.6.4 లక్షలకు అంచనాలను మార్పులు వేసి 6 పనులుగా విభజించారు.
● సుమారు రూ.36 లక్షలతో టీడీపీ సీనియర్ నేత నీటి వినియోగదారుల సంఘాల పేరుతో పూడికతీక పనులు అసంపూర్తి చేశారని సమాచారం.
● కర్నూలులోని స్వామిరెడ్డినగర్, స్టాంటన్‌పురం, బంగారుపేట, జొహరాపురం సమీపంలోని కేసీ కెనాల్‌లో ౖపైపెనే పూడికతీసి వదిలేశారు. కొన్ని చోట్ల మట్టి కుప్పలు కాల్వ మధ్యలోనే వదిలేశారు.
● పనులు పూర్తికాకుండానే కాల్వకు నీరు వదలడంతో ఆ మట్టి కుప్పలు నీటిలోనే కలిసిపోయాయి.
కేసీ కెనాల్‌లో తొలగని మట్టి కుప్పలు
కాలువ నిండా పేరుకపోయిన
చెత్త, చెదారం
సుంకేసుల నుంచి నీటిని విడుదల
చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలు

అడ్డంకులు ఉన్నా కేసీకి నీరు విడుదల!