రూ. 10 లక్షల విలువ చేసే ఎరువుల అమ్మకాల నిలిపివేత | - | Sakshi
Sakshi News home page

రూ. 10 లక్షల విలువ చేసే ఎరువుల అమ్మకాల నిలిపివేత

Jul 14 2025 4:55 AM | Updated on Jul 14 2025 4:55 AM

రూ. 1

రూ. 10 లక్షల విలువ చేసే ఎరువుల అమ్మకాల నిలిపివేత

ఎమ్మిగనూరురూరల్‌: ఎరువుల దుకాణంలో ఓ ఫామ్‌ ఇంక్లూడ్‌ చేయనందున్న రూ. 10 లక్షల విలువ చేసే ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేసినట్లు మండల వ్యవసాయాధికారి మదిరెపల్లి శివశంకర్‌ పేర్కొన్నారు. ఆదివారం పట్టణంలోని మంత్రాలయం రోడ్డ్‌లోని శ్రీ మల్లికార్జున ఫర్టిలైజర్స్‌ అండ్‌ ఫెస్టిసైడ్స్‌ దుకాణంలో ఏవో ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. దుకాణంలో రికార్డులు, స్టాక్‌, లైసెన్సులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుకాణంలో ఎరువుల అమ్మకాలకు సంబంధించిన ఓ ఫామ్‌ ఇంక్లూడ్‌ చేయనందున్న అమ్మకాలను నిలుపుదల చేసినట్లు చెప్పారు. స్టాక్‌ రిజిస్టర్‌ అప్ట్‌డేట్‌ చేయనందుకు స్టాక్‌ రిజిస్టర్‌ బ్యాలెన్స్‌, గ్రౌండ్‌ బ్యాలెన్స్‌ టాలీ కానందున 42 యూరియా బస్తాల అమ్మకాలను కూడా నిలుపుదల చేసినట్లు తెలిపారు.

జేవీవీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా సురేష్‌కుమార్‌

కర్నూలు(హాస్పిటల్‌): జనవిజ్ఞాన వేదిక(జేవీవీ) రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా బి.సురేష్‌కుమార్‌ ఎంపికయ్యారు. జేవీవీ రాష్ట్ర 18వ మహాసభలు ఈ నెల 12, 13వ తేదీల్లో కడప నగరంలో నిర్వహించారు. ఈ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర కార్యవర్గాన్ని ఎన్నిక చేశారు. అందులో సురేష్‌కుమార్‌తో పాటు రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీగా శేషాద్రిరెడ్డి, రాష్ట్ర గౌరవాధ్యక్షులుగా మహమ్మద్‌ మియ్య, శిక్షణా విభాగానికి అధ్యక్షులుగా ప్రతాపరెడ్డి, వ్యవసాయ రంగానికి రామకృష్ణారెడ్డి ఎంపికయ్యారు. ఈ కమిటీలో ఎక్కువ మంది జిల్లాకు చెందిన వారే ఉండటం హర్షణీయమని, ఇది జిల్లాకు దక్కిన గౌరవమని, మరింత బాధ్యతగా పనిచేసే వేదికను విస్తృత పరచాలని వేదిక వ్యవస్థాపకులు డాక్టర్‌ బ్రహ్మారెడ్డి ఆకాంక్షించారు.

పదోన్నతులు లేకుండా నోటిఫికేషన్‌ ఎలా?

కర్నూలు(హాస్పిటల్‌): రాష్ట్రంలోని బోధనాసుపత్రుల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఈ నెల 17న వాక్‌ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ కార్యాలయం ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌పై వైద్యుల నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కాంట్రాక్ట్‌ విధానంలో 40 ప్రొఫెసర్లు, 37 అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల కోసం నోటిఫికేషన్‌ జారీ కావడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్‌ అయిన వైద్యులను ఈ నోటిఫికేషన్‌ ద్వారా తీసుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల కర్నూలుకు వచ్చిన ఎన్‌టీఆర్‌ హెల్త్‌ వర్శిటి వీసీ డాక్టర్‌ పి. చంద్రశేఖర్‌, అకడమిక్‌ డీఎంఈ డాక్టర్‌ రఘునందన్‌లను నిలదీశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో చాలా మంది వైద్యులు పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్నారని, వీరిని కాదని, తాజాగా ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లను నియమించేందుకు నోటిఫికేషన్‌ విడుదల చేయడం ఏమిటని మండిపడుతున్నారు. దీనివల్ల సీనియారిటీ సమస్యలు వస్తాయని, ముందుగా పదోన్నతులు నిర్వహించి, ఖాళీగా ఉన్న, ఎవ్వరూ రాని పోస్టుల్లో మాత్రమే నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అంతవరకు ప్రస్తుతం విడుదల చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేయాలని వారు కోరుతున్నారు. దీంతో ఈ విషయమై డీఎంఈ అధికారులు సైతం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. దీనిపై త్వరలో ఓ నిర్ణయానికి రానున్నట్లు సమాచారం.

రూ. 10 లక్షల విలువ చేసే ఎరువుల అమ్మకాల నిలిపివేత1
1/1

రూ. 10 లక్షల విలువ చేసే ఎరువుల అమ్మకాల నిలిపివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement