బెలుం గుహలకు ప్రపంచ స్థాయి గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

బెలుం గుహలకు ప్రపంచ స్థాయి గుర్తింపు

Jun 14 2025 7:41 AM | Updated on Jun 14 2025 7:41 AM

బెలుం గుహలకు ప్రపంచ స్థాయి గుర్తింపు

బెలుం గుహలకు ప్రపంచ స్థాయి గుర్తింపు

● భౌగోళిక వారసత్వ జాబితాలో చోటు ● జియాలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వెల్లడి

కొలిమిగుండ్ల: భూమి అంతర్భాగంలో సహజ సిద్ధంగా ఏర్పడిన అద్భుత బెలుం గుహలకు ఎట్టకేలకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించనుంది. దేశంలో మేఘాలయలోని క్రైమ్‌ లియాట్‌ ప్రాహ్‌ గుహల తర్వాత రెండవ అతి పెద్ద గుహలుగా నిలిచాయి. ప్రపంచంలో రెండో గుహగా బెలుం గుహలను గుర్తించారు. కొలిమిగుండ్ల–బెలుం ప్రధాన రహదారిలో విస్తరించాయి. భౌగోళిక వారసత్వ ప్రదేశంగా జియా లాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ఇటీవలనే వెల్లడించింది. గుహల అందాలను తిలకించేందుకు దేశ, విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. వారసత్వ సంపద జాబితాలో చోటు దక్కించుకోవడంతో బెలుం గుహలకు మరింత ప్రాచుర్యం లభించనుంది. విదేశీ పర్యాటకులు ఆకట్టుకునేలా ప్రచారం కల్పించేందుకు అవకాశాలు మెరుగుపడ్డాయి. పదివేల సంవత్సరాల క్రితం చిత్రావతి నది ప్రవాహం వల్ల గుహలుగా ఏర్పడ్డాయి. 3,229 మీటర్ల మేర ఇవి విస్తరించి ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement