పిల్లలతో పని చేయిస్తే జైలుశిక్ష | - | Sakshi
Sakshi News home page

పిల్లలతో పని చేయిస్తే జైలుశిక్ష

Jun 13 2025 7:09 AM | Updated on Jun 13 2025 7:09 AM

పిల్లలతో పని చేయిస్తే జైలుశిక్ష

పిల్లలతో పని చేయిస్తే జైలుశిక్ష

కర్నూలు(అర్బన్‌): పిల్లలతో పని చేయిస్తే ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల పాటు జైలు శిక్ష విధిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకటశేషాద్రి అన్నారు. గురువారం స్థానిక న్యాయ సేవా సదన్‌లో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిన్నారులను పనిలోకి అనమతించడం, పని చేయించుకోవడం పూర్తిగా నిషేధమని, చట్టాన్ని ఎవరైనా ఉల్లంఘిస్తే చట్టప్రకారం శిక్షలు ఉంటాయన్నారు. శాశ్వత లోక్‌ అదాలత్‌ చైర్మన్‌ వెంకట హరినాథ్‌ మాట్లాడుతూ బాల బాలికలతో షాపులు, ఫ్యాక్టరీలు, ఇతరత్రా వాణిజ్య కేంద్రాల్లో పని చేయించుకోవడం నేరమన్నారు. ఎక్కడైనా బాల కార్మికులు కనిపిస్తే వెంటనే 1098 లేదా లీగల్‌ సర్వీసెస్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 15100కు కాల్‌ చేసి తెలియజేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే బాల కార్మిక వ్యతిరేక దినోత్సవ పోస్టర్లను అవిష్కరించి, న్యాయ సేవా సదన్‌ నుంచి కొండారెడ్డిబురుజు వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో కర్నూలు బార్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ హరినాథ్‌చౌదరి, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్‌ ఆఫీసర్‌ సాంబశివరావు, డీసీపీఓ శారద, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్మన్‌ జుబేదాబేగం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement