
ఇవీ సౌకర్యాలు
● కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్(ట్యాలీ)లో శిక్షణ పొందేందుకు డిగ్రీ అర్హత కలిగి ఉండాల్సి ఉంది. మిగిలిన కనీస విద్యార్థత 10 వతరగతి ఉంటే చాలు. 18 నుంచి 45 ఏళ్లలోపు వారందరు అర్హులే.
● ఉమ్మడి జిల్లా యూనిట్‌గా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
● మహిళలు శిక్షణ పొందే సమయంలో పురుషులు ఉండరు. పురుషులు శిక్షణ పొందే సమయంలో మహిళలు ఉండరు.
● ప్రతి రోజు రోజుకు ఒక్కో రకం అల్పాహారం, మధ్యాహ్నం భోజనంలో ప్రతి రోజు గుడ్లు, రాత్రి భోజనంలో ప్రతి రోజూ అరటి పండు ఇస్తారు. భోజనంతో పాటు హాస్టల్ వసతి కూడా కల్పిస్తున్నారు.