
సర్పంచ్‌లకు తెలియకుండా నిధుల డ్రా
● అధికారులపై ప్రజాప్రతినిధులు ఆగ్రహం
పత్తికొండ: గ్రామాల్లో టీడీపీ నాయకుల అండ చూసుకొని సర్పంచ్‌లకు తెలియకుండా కొందరు నిధులుడ్రా చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని పలువురు సర్పంచ్‌లు మండిపడ్డారు. పత్తికొండ మండల పరిషత్ సమావేశ భవనంలో ఎంపీపీ నారాయణ దాస్ అధ్యక్షతన గురువారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. దూదేకొండ సర్పంచ్ ముజఫర్ రెహమాన్ మాట్లాడుతూ.. తన గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్రమంగా నిధులు డ్రా చేశారని, ఈ విషయం అధికా రులు దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. సర్పంచ్‌లతో సంబంధం లేకుండా నిధులు డ్రా చేసే అధికారం కొత్తగా కూటమి ప్రభుత్వం ఏమైనా ఉత్తర్వులు ఇచ్చి ఉంటే చూపాలని కోరారు. సమస్యలపై అధికారులు చర్చించి చర్యలు చేపడతామని ఎంపీడీవో కవిత, ఎంపీపీ దాస్ తెలిపారు. వైస్ ఎంపీపీ రంగమ్మ, మేజర్ పంచాయతీ కార్యదర్శి నరసింహులు, వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీటీసీలు నీలకంఠ, కేశప్ప, పెద్దవీరన్న, కృష్ణారెడ్డి, లక్ష్మి, మహలక్ష్మి, సర్పంచ్‌లు ప్రవీణ, కేశవరెడ్డి, అంజనేయులు పాల్గొన్నారు.