
ఖాళీ కుర్చీల ‘మహా’నాడు
నంద్యాల(అర్బన్): స్థానిక టెక్కె మార్కెట్‌యార్డులో గురువారం నిర్వహించిన నంద్యాల జిల్లా స్థాయి మహానాడులో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. వేలాది మంది కార్యక్రమానికి హాజరవుతారని భావించిన నిర్వాహకులకు నిరాశ ఎదురైంది. మూడు షెడ్లలో ఏర్పాటు చేసిన మహానాడుకు ఒక్క షెడ్డులో మాత్రమే కార్యకర్తలు కూర్చోవడంతో మిగిలిన రెండు షెడ్లలో ఖాళీ కుర్చీలు కనిపించాయి. భారీగా పార్టీ శ్రేణులు వస్తారని భావించిన నిర్వాహకులు అనుకున్న స్థాయిలో రాకపోవడంతో చేసేదేమీ లేక నాయకులు ఆర్భాటపు ప్రసంగాలతో అదరగొట్టారు. ఈ కార్యక్రమానికి డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి గైర్హాజరయ్యారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల్ల రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో తమ నియోజకవర్గానికి నిధులు మంజూరు కాలేదంటూ డోన్ నియోజకవర్గ నాయకులు ధర్మారం సుబ్బారెడ్డి సభ దృష్టికి తేవడం చర్చనీయాంశమైంది. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామ, మండల స్థాయి కమిటీలో పెండింగ్‌లో ఉన్నాయన్నా రు. మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ నాణ్యమైన పొగాకును కంపెనీలు కచ్చితంగా కొనుగోలు చేస్తారని, నాణ్యత లేని పొగాకు విషయంలో రైతులు కొంత రాజీ పడక తప్పదనానరు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ, ఆర్‌ఐసీ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డిలు సభ మధ్యలోనే వెళ్లిపోయారు. కార్యక్రమంలో మంత్రి ఫరూక్, ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు గౌరుచరితారెడ్డి, జయసూర్య, మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డోన్ ఎమ్మెల్యే కోట్ల డుమ్మా
ఆర్భాటపు ప్రసంగాలతో
మమ అనిపించిన నేతలు
వెక్కిరించిన ఖాళీ కుర్చీలు

ఖాళీ కుర్చీల ‘మహా’నాడు