
లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు
● ఒకరు మృతి
డోన్ టౌన్: జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన లారీ క్లీనర్ గోపి చంద్ అలియాస్ చంటి(25)మృతి చెందాడు. లారీ డ్రైవర్ అమీర్, బస్సు డ్రైవర్ భాస్కర్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రయాణికులు హేమ, మహిధర్‌తో పాటు మరికొంత మందికి స్వల్ప గాయాలు అయ్యినట్లు పట్టణ పోలీసులు తెలిపారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత (గురువారం తెల్లవారు జాము 1గంట దాటిన తరువాత) అనంతపురం నుంచి కర్నూలు వైపుకు వెళుతు న్న లారీ టైర్ పంక్చర్ అయ్యింది. జాతీయ రహదారిపై యు.కొత్తపల్లె వద్ద ఉన్న బ్రిడ్జి వద్ద లారీని ఆపారు. క్లీనర్ చంటి లారీ టైర్ల కింద రాళ్లు పెట్టడానికి ఉండగా కదిరి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్‌కు వెళ్తూ ఢీ కొట్టింది. లారీ వెనుక నిలబడి ఉన్న చంటి నలిగి పోయి అక్కడికక్కడే మృతి చెందారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.