
మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి
వెల్దుర్తి: మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలని డీఆర్‌డీఏ పీడీ కేవీ రమణారెడ్డి అన్నారు. పీఎమ్‌ఆర్‌ఎమ్‌ఈ కింద, ఎస్‌బీఐ సౌజన్యంతో పట్టణ సభ్యురాలు లక్ష్మిదేవి తీసుకున్న ఆయిల్ మిషన్‌ను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం స్థానిక కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ప్రతి పొదుపు సభ్యురాలు జీవనోపాధులను మెరుగు పరుచుకోవాలన్నారు. కుటుంబ అవసరాలకు కిచెన్ గార్డెన్ తదితరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. డీపీఎంలు నర్సమ్మ, నవీన్, ఏపీఎం అనురాధ, హెచ్‌డీ ఏపీఎం వెంకటస్వామి, ఉన్నతి ఏపీఎం కాశేశ్వరుడు, సీసీలు పాల్గొన్నారు.
‘ఎకై ్సజ్’ సమస్యలు పరిష్కరించండి
కర్నూలు: జిల్లా ఎకై ్సజ్ శాఖలో పనిచేస్తున్న సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎకై ్సజ్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ వినతిపత్రం సమర్పించారు. జిల్లా ఎకై ్సజ్ శాఖలో 135 మంది కానిస్టేబుళ్లు ఉండగా, కేవలం 61 మంది మాత్రమే ఉన్నారని, సిబ్బంది కొరత వల్ల ఉన్న సిబ్బందిపై పనిభారం పెరిగి ఇబ్బంది పడుతున్నట్లు తెలిపారు. ఎకై ్సజ్ శాఖలో పోలీసు కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను చేపట్టి సిబ్బందిపై పనిభారం తగ్గించేందుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా వినతిపత్రంలో కోరారు. ఎస్‌ఐలు సందీప్, సోమశేఖర్, నవీన్, రెహనా బేగం త దితరులు కూడా రాహుల్ దేవ్ శర్మను కలసిన వారిలో ఉన్నారు.

మహిళలు పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలి