గురువారం శ్రీ 15 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

గురువారం శ్రీ 15 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

Oct 15 2026 11:41 AM | Updated on Oct 15 2026 11:41 AM

గురువారం శ్రీ 15 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 ● నాల్గో రోజు శ్రీమహాచండిగా దుర్గమ్మ దర్శనం ● అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ● నేడు లలితా త్రిపుర సుందరిగా అలంకారం శ్రీచండీ.. భక్తి నిండి అమలు కాని ఆదేశాలు..

న్యూస్‌రీల్‌

ముందుగానే నగరోత్సవం

త్రిశక్తి స్వరూపిణీని దర్శించి తరించిన భక్తజనవాహిని

రాష్ట్రపతి కోసం ప్రత్యేక లడ్డూ..

విద్యుత్‌ దీపకాంతుల్లో మెరిసిపోతున్న

ఇంద్రగిరి, (ఇన్‌సెట్‌లో) చండీదేవిగా దుర్గమ్మ

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దసరా ఉత్సవ కాంతులతో శోభాయమానంగా వెలుగొందుతున్న ఇంద్రగిరిపై దుర్గమ్మ వారు నాలుగో రోజు బుధవారం సింహవాహినిగా, త్రిశక్తి స్వరూపిణిగా చిరుమంద హాసంతో మహాచండీ అలంకారంలో కొలువై భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ప్రత్యేక ఖడ్గమాలార్చన, ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక శతచండీహోమం, ప్రత్యేక శ్రీచక్రనవార్చనల్లో పెద్ద ఎత్తున ఉభయదాతలు పాల్గొన్నారు. సాయంత్రం ఆరు గంటలకు సుమారు 75వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకుని నేరుగా అన్నప్రసాద భవనానికి చేరుకున్నారు. తర్వాత కనకదుర్గనగర్‌లోని ఏర్పాటు చేసిన కౌంటర్లలో లడ్డూలను కొనుగోలు చేసి భక్తులు తిరుగు ప్రయాణమయ్యారు.

ప్రత్యేక ఏర్పాట్లు..

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో బుధవారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు ప్రొటోకాల్‌ దర్శనాలను అనుమతించారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి కొండపైకి పూర్తిగా వాహనాల రాకపోకలను నిలిపివేశారు. ఘాట్‌ రోడ్డులోని ఓం టర్నింగ్‌ నుంచి ఆలయం వరకు, ఆలయ పరిసరాలను పూర్తిగా భద్రత సిబ్బంది తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

పెరిగిన భవానీల రద్దీ

భవానీ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. తెల్లవారుజామునే పవిత్ర కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరించిన భవానీలు క్యూలైన్‌ మార్గంలో అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్రవారం నుంచి భవానీల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.

దివ్యాంగుల ఇబ్బందులు..

దసరా ఉత్సవాలలో దివ్యాంగులకు ఇబ్బందులు తప్పడం లేదు. బుధవారం ఉదయం దేవదాయ శాఖ కమిషనర్‌ క్యూలైన్లు మినహా అన్ని గేట్లకు తాళాలు వేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మౌన స్వామి విగ్రహం, గాలిగోపురం వద్ద గేట్లకు ఆలయ సిబ్బంది తాళాలు వేశారు. దీంతో వీల్‌చైర్లలో ఆలయానికి చేరుకున్న వికలాంగులను సైతం క్యూలైన్‌లోనే దర్శనానికి వెళ్లాలని సూచించారు. దీంతో పలువురు వికలాంగులు క్యూలైన్‌లోకి వీల్‌చైర్లతో ప్రవేశించి మెట్లు వచ్చినప్పుడు అతి కష్టం మీద నడుచుకుంటూ ఆలయంలోకి చేరుకున్నారు.

నాల్గో రోజు ఆదాయం రూ. 17.13 లక్షలు

ఉత్సవాలలో నాల్గో రోజైన బుధవారం దేవస్థానానికి రూ. 17.13లక్షల మేర ఆదాయం సమకూరింది. లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ. 15.53లక్షలు, కేశఖండనశాల టికెట్ల విక్రయం ద్వారా రూ. 30,760, ఇతర ఆదాయాల ద్వారా రూ. 5వేలు లభించినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు. అలాగే నాల్గో రోజు మొత్తం 1.04 లక్షల లడ్డూలను విక్రయించారు.

రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఆది దంపతుల నగరోత్సవ సేవ బుధవారం నాలుగు గంటలకే ఆలయ అధికారులు ప్రారంభించారు. మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాల వద్ద ఉత్సవ

మూర్తులకు పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కొబ్బరి కాయ కొట్టి నగరోత్సవసేవను లాంఛనంగా ప్రారంభించారు. మొత్తంగా గంటన్నర సమయంలోనే నగరోత్సవం తిరిగి ఆలయానికి చేరింది. కాగా ఉత్సవాలలో ఐదో రోజైన గురువారం దుర్గమ్మ శ్రీలలితా త్రిపుర సుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆమెకు దేవస్థానం ప్రత్యేకంగా తయారు చేసిన లడ్డూను అందించింది. జాయింట్‌ఫుడ్‌ కంట్రోలర్‌ శ్రీనివాస్‌, ఎఫ్‌ఎస్‌వోలు వెంకటేశ్వర్లు, రవీంద్రరెడ్డి పర్యవేక్షణలో ఆలయ అధికారుల ప్రత్యేకంగా ఈ లడ్డూను తయారు చేశారు. నేతితో తయారు చేసిన లడ్డూలో దిట్టం ప్రకారం పంచదార, జీడిపప్పు, పటికిబెల్లం ముక్కలు, కిస్‌మిస్‌లు, కర్పూరం వినియోగించారు.

దసరా ఉత్సవాలలో భక్తుల రద్దీ తక్కువగా ఉంటే ఆలయానికి సమీపంలోని మార్గాల ద్వారా క్యూలైన్‌లోకి అనుమతిస్తామని ఆలయ ఈవో శీనానాయక్‌ గతంలో పేర్కొన్నారు. ఆదివారం మినహా మిగిలిన మూడు రోజులు పగటి వేళ క్యూలైన్లు ఖాళీగానే కనిపిస్తున్నాయి. అయినప్పటికీ భక్తులు వినాయకుడి గుడి వరకు వెళ్లి క్యూలైన్‌లో ఆలయానికి చేరుకోవాల్సి వస్తోంది. ఈ ఏడాది ఉత్సవాలలో రద్దీ తక్కువగా ఉన్న సమయంలో భక్తులను రథం సెంటర్‌, టోల్‌గేట్ల వద్ద నుంచి కూడా క్యూలైన్‌లోకి అనుమతిస్తామని ప్రకటించారు. అయితే ఉత్సవాలు ప్రారంభమై నాల్గో రోజులు అవుతున్నా ఇంత వరకు ఈవో ఆదేశాలు అమలు కాకపోవడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement