ఏఐతో భక్తుల భద్రతకు పెద్దపీట | - | Sakshi
Sakshi News home page

ఏఐతో భక్తుల భద్రతకు పెద్దపీట

Oct 15 2026 11:41 AM | Updated on Oct 15 2026 11:41 AM

ఏఐతో భక్తుల భద్రతకు పెద్దపీట వన్‌టౌన్‌(విజయవాడపశ్చిమ): దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, ట్రాఫిక్‌ నిర్వహణకు పోలీసు శాఖ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తోందని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా అన్నారు. దసరా ఉత్సవాల్లో భాగంగా డీజీపీ బుధవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్‌లో మాట్లాడారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే నేపథ్యంలో సంప్రదాయ పోలీసు బందోబస్తుతోపాటు సాంకేతిక నిఘా వ్యవస్థలకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. ఏఐ ఆధారిత రద్దీ విశ్లేషణ ద్వారా భక్తుల రాకపోకలను అంచనా వేయడం, రద్దీ పెరిగే ప్రాంతాలను గుర్తించడం, అవసరమైన చోట్ల సిబ్బందిని అప్రమత్తం చేయడం లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం ద్వారా వివిధ ప్రాంతాల పరిస్థితులను సమన్వయంతో పర్యవేక్షించేలా ఏర్పాట్లు చేశామన్నారు. దేవస్థానం ఈవో శీనా నాయక్‌, జిల్లా పోలీసు కమిషనర్‌ రాజశేఖరబాబు తదితరులు పాల్గొన్నారు. కార్తికేయుని ఆదాయం రూ. 1.20 కోట్లు జెడ్పీ సీఈవో అరుణ బదిలీ

మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో భక్తులు హుండీల్లో సమర్పించిన కానుకల రూ.1,20,62,105 వచ్చినట్లు ఆలయ డెప్యూటీ కమిషనర్‌ దాసరి శ్రీరామ వరప్రసాదరావు బుధవారం వెల్లడించారు. ఉదయం ఆలయ ప్రాంగణంలో మచిలీపట్నం డివిజన్‌ తనిఖీ అధికారి కె. శ్రీనివాసరావు సమక్షంలో కానుకలను లెక్కించారు. డీసీ మాట్లాడుతూ నగదుతో పాటు భక్తులు కానుకల రూపంలో వెండి ఒక కిలో 900 గ్రాములు, బంగారం 69 గ్రాములు, విదేశీ కరెన్సీ అమెరికన్‌ డాలర్లు 230, ఆస్ట్రేలియన్‌ డాలర్లు 70, కెనడా డాలర్స్‌ 20, ఇంగ్లాండ్‌ పౌండ్స్‌ 10 వచ్చాయన్నారు.

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా పరిషత్‌ సీఈవో డాక్టర్‌ జె. అరుణ బదిలీ అయ్యారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతిలాల్‌ దండే బుధవారం ఉత్తర్వులు విడుదల చేశారు. అరుణను తదుపరి పోస్టింగ్‌ కోసం ప్రభుత్వానికి రిపోర్టు చేయాలని ఆదేశించారు. ఈ స్థానంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ శిక్షణా సంస్థ (ఏపీఎస్‌ఐఆర్‌డీపీఆర్‌) డెప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మోమిడి శ్రీహరిని కృష్ణా జిల్లా ప్రజా పరిషత్‌ సీఈవోగా నియమించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement