ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు ప్రారంభం

Oct 12 2026 8:22 AM | Updated on Oct 12 2026 8:22 AM

ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు ప్రారంభం

వరుస సెలవుల నేపధ్యంలో..

శ్రీకాళహస్తి, కాణిపాకం నుంచి

దుర్గగుడిపై నేడు

లిప్టులు, అనధికార దర్శనాలు యధాతథం

పని చేయని ఆన్‌లైన్‌ కౌంటర్లు

ఇంద్రకీలాద్రి, వన్‌టౌన్‌ (విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో తొలి రోజు ఆదివారం అమ్మవారు శ్రీబాలాత్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం ఒక్క రోజే సుమారు లక్ష మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. తెల్లవారుజామున 2 గంటలకు అమ్మవారికి సుప్రభాత సేవ అనంతరం స్నపనాభిషేకం, విశేష అలంకరణ, పూజా కార్యక్రమాల అనంతరం ఉదయం 8.30 గంటలకు దర్శనాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారి తొలి దర్శనం మంత్రి సుభాష్‌, కలెక్టర్‌ లక్ష్మీశ, సీపీ రాజశేఖరబాబు, ఆలయ ఈవో శీనానాయక్‌, చైర్మన్‌ రాధాకృష్ణ చేసుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. ప్రధాన ఆలయం నుంచి అమ్మవారి ఉత్సవమూర్తిని నూతన పూజామండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చి ప్రతిష్టించారు. పూజా మండపంలో గణపతి పూజ చేశారు. బాలా త్రిపుర సుందరీదేవి అలంకారంలో దుర్గమ్మను శాసనసభ డెప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ పశ్చిమ ఎమ్మెల్యే సుజనాచౌదరి, మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌, కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్‌ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక కుంకుమార్చన, ప్రత్యేక శత చండీహోమం, ప్రత్యేక శ్రీచక్రనవార్చనలను నిర్వహించారు. ఉభయదాతలను ప్రత్యేక క్యూలో అమ్మవారి దర్శనానికి అనుమతించారు.

క్యూలో విచ్చేసే వారికే తొలి ప్రాధాన్యమిస్తామని చెప్పిన ఆలయ అధికారుల మాటలు ఆచరణలో మాత్రం అమలు కాలేదు. ఉత్సవాల్లో తొలి రోజే లిఫ్టుల ద్వారా తమకు కావాల్సిన వారిని పోలీసు, దేవస్థాన కమిటీ సభ్యులు యథేచ్ఛగా కొండపైకి తీసుకువెళ్లి దర్శనాలు చేయించారు. మరోవైపున ప్రజాప్రతినిధుల తరఫున సేవా దళం ఆలయ పరిసరాల్లో తిరుగుతూ తమ వారికి దర్శనాలు చేయిస్తున్నారు. వన్‌టౌన్‌లోని ఓ సత్రంకు చెందిన సభ్యుడు ప్రొటోకాల్‌ డ్యూటీ చేయడం గమనార్హం. మెడలో కండువా, ఐడీ కార్డును ధరించి దర్జాగా దర్శనాలు చేయిస్తున్నా అడ్డుకునే వారే లేకపోయారు.

వీకెండ్‌, వరస సెలువులు, దసరా ఉత్సవాలు ఆదివారం ప్రారంభం కావడంతో ఆదివారం రికార్డు స్థాయిలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. కెనాల్‌రోడ్డు, సీతమ్మ వారి పాదాల వద్ద కంపార్టుమెంట్లతో పాటు కుమ్మరి పాలెం వైపు క్యూలైన్‌లోనూ భక్తుల తాకిడి కనిపించింది.

ఉత్సవాల్లో భాగంగా బాలాత్రిపుర సుందరీదేవిగా దర్శనమిచ్చిన అమ్మవారికి కాళహస్తి, కాణిపాకం దేవస్థానాల నుంచి పట్టువస్త్రాలను సమర్పించారు. కాళహస్తి ఈవో బీకే వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్‌రెడ్డి, పాలక మండలి సభ్యులు పట్టువస్త్రాలతో దుర్గగుడికి చేరుకోగా, ఆలయ చైర్మన్‌ రాధా కృష్ణ సాదరంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అంద జేయగా, అమ్మవారికి పట్టుచీర, పూజా సామగ్రి, సారెను సమర్పించారు.

అమ్మవారి లడ్డూ ప్రసాదాలు విక్రయించే ఆన్‌లైన్‌ కౌంటర్లు పని చేయకపోవడంతో భక్తులు ఇబ్బందులకు గురయ్యారు. దసరా ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం నాలుగు ఆన్‌లైన్‌ కౌంటర్లు ఏర్పాటు చేసింది. భక్తులు ముందుగానే ఆన్‌లైన్‌లో ప్రసాదాలు కొనుగోలు చేయడంతో పాటు కౌంటర్లలో మొబైల్‌ ఫోన్ల ద్వారా ఆన్‌లైన్‌ పేమెంట్‌లు చేసి ప్రసాదాలను కొనుగోలు చేయవచ్చు. అయితే ఆదివారం మధ్యాహ్నం నుంచి సర్వర్‌ పని చేయకపోవడంతో భక్తులు వెనుదిరగడం కనిపించింది. మరో వైపు ఈ సమస్యపై ఈవో శీనానాయక్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సాయంత్రం వరకు సమస్య పరిష్కారం కాలేదు.

● ఉత్సవాల్లో తొలి రోజున దేవస్థానానికి రూ. 29.01 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

ఆదివారం ఉదయం 8 గంటల సమయంలో కార్పొరేషన్‌ సమీపంలో అధిక సంఖ్యలో భక్తుల రద్దీ , క్యూలో భక్త తరంగాలు

తెల్లవారుజామున 3 గంటలకు అమ్మవారి దర్శనం ప్రారంభం

తెల్లవారుజామున 4 గంటలకు నూతన పూజామండపంలో ఖడ్గమాలార్చన

ఉదయం 6 గంటలకు , 9 గంటలకు ప్రత్యేక కుంకుమార్చన

ఉదయం 8 గంటలకు ప్రత్యేక శత చండీహోమం, ప్రత్యేక శ్రీచక్రనవార్చన

సాయంత్రం 6 గంటలకు అమ్మవారికి మహా నివేదన , పంచహారతుల సేవ

సాయంత్రం 6 గంటలకు ఆది దంపతులకు నగరోత్సవ సేవ

రాత్రి 11 గంటల వరకు అమ్మవారి దర్శనం

బాలాత్రిపురసుందరిగా

దుర్గమ్మ దర్శనం

భక్తజనులకు కనుల పండువ

లిప్టుల వినియోగం, సిఫారసు దర్శనాలు

సామాన్య భక్తులకు ఇక్కట్లు

అర్చకులు, మీడియాకు తప్పని ఆంక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement