కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Oct 12 2026 8:22 AM | Updated on Oct 12 2026 8:22 AM

సోమవారం శ్రీ 12 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026 పులిచింతల సమాచారం

న్యూస్‌రీల్‌

నేడు పీజీఆర్‌ఎస్‌

సోమవారం శ్రీ 12 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

7

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 28.9578 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు 400 క్యూసెక్కులు లీకేజీల ద్వారా వెళుతోంది.

వేద మంత్రాల నడుమ.. మంగళవాయిద్యాల సవ్వడితో.. అమ్మవారి నామస్మరణతో ఇంద్రకీలాద్రి ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. జగజ్జనని శ్రీ కనకదుర్గమ్మ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొలి రోజున అమ్మవారు శ్రీ బాలాత్రిపురసుందరీదేవిగా దర్శనమివ్వడంతో కొండ పరిసరాలు భక్తిభావంతో పులకించిపోయాయి. అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు పద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మరోవైపు ప్రముఖులు, వీఐపీల రాక, సిఫారసు దర్శనాల మధ్య సామాన్య భక్తులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆంక్షలు, రద్దీ నడుమ భక్తుల గంటల తరబడి నిరీక్షించారు.

చిలకలపూడి(మచిలీపట్నం): కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ డీకే బాలాజీ ఆదివారం తెలిపారు. జిల్లా అధికారులు ఉదయం 10 గంటలకు తప్పక హాజరుకావాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement