ఆదివారం రికార్డు స్థాయిలో వందకు పైగా భక్తి బృందాలు, సుమారు 35వేల మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించినట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. ఆషాఢ మాసోత్సవాలలో ఇంత భారీ స్థాయిలో భక్తులు అమ్మవారికి సారె సమర్పించడం ఇదే తొలిసారని అధికారులు పేర్కొన్నారు. సారె సమర్పించేందుకు విచ్చేసిన భక్తులతో ఆలయ ప్రాంగణంలో ఎక్కడ చూసినా రద్దీనే కనిపించింది. మహామండపం, రాజగోపురం, లక్ష్మీ గణపతి ప్రాంగణం, ఘాట్‌రోడ్డు ఇలా ఎక్కడ చూసినా బృందాలు, బృందాలుగా భక్తులు కనిపించారు. రద్దీ నేపథ్యంలో అమ్మవారి దర్శనానికి గంటన్నర సమయం పట్టింది. వెస్ట్ ఎసీపీ దుర్గారావు, వన్‌టౌన్ సీఐ గుణారామ్ స్కానింగ్ పాయింట్‌లో రద్దీని పర్యవేక్షించి ఆలయ సిబ్బందితో పాటు పోలీసు, సెక్యూరిటీ సిబ్బందికి సూచనలు ఇచ్చారు.


