గూడూరు: గూడూరు మండలం మల్లవోలు శివారు కుమ్మరిపాలెంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది. గూడూరు పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం కుమ్మరిపాలెంలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం ప్రతిరోజూ ఉదయం 6 గంటలకు తెరచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. మంగళవారం రాత్రి 9.30 గంటల వరకు ఆలయంలో భక్తులు భజన కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం పూజారి గర్భగుడికి తాళాలు వేసుకుని వెళ్లిపోయారు. బుధవారం ఉదయం యథావిఽధిగా గుడికి వచ్చిన పూజారి గర్భగుడికి వేసిన తాళాలు పగలగొట్టినట్లు గుర్తించి. ఆలయ కమిటీ చైర్మన్ ముంగర హరినాఽథ్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో ఘటనా స్థలానికి వచ్చిన హరినాఽథ్, కమిటీ సభ్యులు ఆలయంలో చోరీ జరిగినట్లు నిర్ధారించి గూడూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆలయ కమిటీ చైర్మన్ హరినాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గూడూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్వామి వారి వెండి కిరీటంతో పాటుగా వెండితో చేసిన స్వామి వారి చిన్న విగ్రహం, మకరతోరణం, శఠగోపం, ప్లేటు తదితర వెండి ఆభరణాలు అపహరణకు గురైనట్లు వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిలో దాదాపు 3 కిలోల వెండి ఉంటుందని వారు చెబుతున్నారు. వీటి విలువ రూ.10లక్షల వరకు ఉంటుందని అంచనా. కమిటీ చైర్మన్ ఫిర్యాదుతో ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌లను రంగంలోకి దించి నిందితులను పట్టుకునే పనిలో పడ్డారు.
ఆలయంలో చోరీ జరగక ముందు వెండి
ఆభరణాలతో కూడిన స్వామి వారి విగ్రహం
చోరీ జరిగిన తర్వాత బోసిపోతున్న
స్వామి వారి విగ్రహం
3కిలోల వెండి ఆభరణాలు అపహరణ


