బస్సు ఢీకొని కార్మికుడు మృతి | - | Sakshi
Sakshi News home page

బస్సు ఢీకొని కార్మికుడు మృతి

Jul 29 2026 2:10 AM | Updated on Jul 29 2026 2:10 AM

బస్సు ఢీకొని కార్మికుడు మృతి నేడు స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ 10వ స్నాతకోత్సవం 30, 31 తేదీల్లో హెల్త్‌ యూనివర్సిటీ ఇంటర్‌ కాలేజ్‌ గేమ్స్‌ మీట్‌ మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ అనుబంధంగా ఉన్న కళాశాలల్లోని విద్యార్థుల కోసం ఈ నెల 30, 31 తేదీల్లో చినఅవుటపల్లిలోని డాక్టర్‌ పిన్నమనేని సిద్ధార్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఆవరణలో వాలీబాల్‌, బాస్కెట్‌బాల్‌ అంశాల్లో ఇంటర్‌ కాలేజ్‌ గేమ్స్‌ మీట్‌ను నిర్వహిస్తున్నామని డాక్టర్‌ ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ స్పోర్ట్స్‌ బోర్డ్‌ సెక్రటరీ డాక్టర్‌ ఈ.త్రిమూర్తి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 30వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు ఈ పోటీలను ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ వైస్‌–చాన్సలర్‌ డాక్టర్‌ పి.చంద్రశేఖర్‌ ప్రారంభిస్తారని తెలియజేశారు. యూనివర్సిటీ పరిధిలోని అన్ని వైద్య కళాశాలలకు చెందిన విద్యార్థులు ఈ గేమ్స్‌మీట్‌లో పాల్గొంటారని పేర్కొన్నారు.

కంకిపాడు: బస్సు ఢీకొని కార్మికుడు మృతి చెందిన సంఘటనపై స్థానిక పోలీసుస్టేషన్‌లో మంగళవారం కేసు నమోదైంది. ఎస్‌ఐ కేవై దాసు తెలిపిన కథనం మేరకు...కంకిపాడు పట్టణంలోని పద్మావతి నగర్‌లో నివాసం ఉంటున్న గుడివాడ విష్ణువర్థన్‌రావు (62) పట్టణంలోని పొగాకు కొట్టులో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. మంగళవారం మధ్యాహ్నం తన ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు స్థానికంగా ఉన్న అపార్టుమెంట్‌ వద్ద నిలబడ్డాడు. రవీంద్ర భారతి పాఠశాలకు చెందిన స్కూల్‌ బస్సు డ్రైవరు నిర్లక్ష్యంగా బస్సును వెనక్కి రివర్స్‌ చేయటంతో విష్ణువర్థన్‌రావును బస్సు ఢీకొని కిందపడ్డాడు. అతని తలకు బలమైన గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు వైద్యం నిమిత్తం పట్టణంలోని ఆసుపత్రికి తరలించగా అప్పటికే విష్ణువర్థన్‌రావు మృతి చెందారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు. మృతుడి కుమారుడు శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ దాసు తెలిపారు.

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): నగరంలోని రమేష్‌ ఆసుపత్రి రోడ్డులో ఉన్న స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ కళాశాల 10వ స్నాతకోత్సవం కళాశాల ఆవరణలోని కృష్ణవేణి సభాగర్‌ ఆడిటోరియంలో బుధవారం జరుగనుంది. పుణేలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సెల్‌ సైన్స్‌ సంస్థ మాజీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శేఖర్‌ సి.మాండే ఈ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ బోర్డ్‌ ఆఫ్‌ గవర్నర్స్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ ఆమోఘ్‌కుమార్‌ గుప్తాతో పాటుగా స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ అండ్‌ ఆర్కిటెక్చర్‌ కళాశాల విజయవాడ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ రమేష్‌ శ్రీకొండ విద్యార్థులకు డిగ్రీలను ప్రదానం చేస్తారు. 2026వ విద్యా సంవత్సరంలో పట్టభద్రులైన 262 మంది విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. విద్యార్థులతో పాటుగా విద్యార్థుల తల్లిదండ్రులు ఈ స్నాతకోత్సవంలో పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement