ఉత్సాహంగా రాష్ట్రస్థాయి రోయింగ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా రాష్ట్రస్థాయి రోయింగ్‌ పోటీలు

Jul 27 2026 2:12 AM | Updated on Jul 27 2026 2:12 AM

చింతలపూడి(జంగారెడ్డిగూడెం): ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని ఎర్రకాలువ వాటర్‌ స్పోర్ట్స్‌ సెంటర్‌లో రాష్ట్రస్థాయి రోయింగ్‌ చాంపియన్‌షిష్‌–2026 పోటీలు ఆదివారం ఉత్సాహంగా జరిగాయి. ఎస్‌ఆర్‌ఏఏపీ, శాప్‌, డీఎస్‌ఏ ఏలూరు సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. శాప్‌ డైరెక్టర్‌ జగదీశ్వరి, శాప్‌ డీఎస్‌డీఓ అజీజ్‌ సిరాజ్‌, ఎస్‌ఆర్‌ఏఏపీ అధ్యక్షుడు తరుణ్‌ కాకాని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బాలురు, బాలికలకు సబ్‌ జూనియర్‌, జూనియర్‌, సీనియర్‌ విభాగాల్లో సింగిల్‌, డబుల్‌ స్కల్స్‌ అంశాలపై ఎంపిక పోటీలు నిర్వహించారు. ప్రధాన కోచ్‌ కృష్ణమూర్తి, టెక్నికల్‌ అఫీషియల్‌ విజయ్‌ రోవర్‌ పర్యవేక్షించారు. ఎన్టీఆర్‌ జిల్లా ప్రతినితి ఎన్‌.పవన్‌ తదితరులు పాల్గొన్నారు.

విజేతల్లో ఎన్టీఆర్‌ జిల్లా వాసులు

జూనియర్‌ మహిళల విభాగంలో ఎస్‌.యమున కాంస్యం, జూనియర్‌ బాలుర విభాగంలో జి.మాధవ్‌ స్వర్ణం, ఐ.జగదీష్‌ కాంస్యం, సీనియర్‌ పురుషుల విభాగంలో జి.సాయిరామ్‌ స్వర్ణ పతకాలు సాధించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement