కృష్ణాజిల్లా | - | Sakshi
Sakshi News home page

కృష్ణాజిల్లా

Jul 26 2026 7:48 AM | Updated on Jul 26 2026 7:48 AM

ఆదివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2026 నీరు ఇవ్వలేం.. ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌లో పాల్గొన్న కలెక్టర్‌ బాలాజీ వరించని చినుకు ఇంకిపోతున్న సాగు ఆశలు

న్యూస్‌రీల్‌

భారీగా ఖర్చులు

సాగు చేసేదెలా?

వర్షాల కోసం రైతుల ఎదురు చూపులు సాగునీటిపై చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం కాలువలకు సాగునీరు ఇవ్వలేమన్న అధికారులు ఇప్పటికే నారుమడులు పోసుకున్న రైతులు

పులిచింతల సమాచారం

ఆదివారం శ్రీ 26 శ్రీ జూలై శ్రీ 2026
నీరు ఇవ్వలేం..

7

ఈపాటికి పచ్చగా కళకళలాడాల్సిన పంట పొలాలు సాగునీరు లేక ఇలా బీడుగా..

మచిలీపట్నంటౌన్‌: స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర లక్ష్యాన్ని ప్రజా ఉద్యమంగా విజయవంతం చేయడంలో ప్రతి పౌరుడూ భాగస్వామి కావాలని కలెక్టర్‌ డి.కె.బాలాజి కోరారు. శనివారం నిర్వహించిన ఆపరేషన్‌ క్లీన్‌ స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్‌ కలెక్టర్‌ బంగ్లా నుంచి పరాసుపేటకు వెళ్లే ప్రధాన రహదారిపై జరిగిన పారిశుద్ధ్య పనుల్లో ఆయన పాల్గొన్నారు. రోడ్ల వెంట పేరుకుపోయిన చెత్తను తొలగించి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన అవస రంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ.. పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యవంతమైన సమాజానికి బలమైన పునాదలని పేర్కొన్నారు. వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఏడు ఎకరాలు కౌలుకు తీసు కున్నా. వరి సాగుకు నీరు లేక ఇబ్బందులు తప్పడంలేదు. ఎండుతున్న పొలా లను బతికించేందుకు ఎంత నీరు పెట్టినా నిలవటం లేదు. ఇంజిన్‌, ఆయిల్‌, ట్యూబుల అద్దె ఖర్చులే ఎక్కువ అయిపోతున్నాయి. ఇలా అయితే సాగు చేయలేం.

– గొరికపూడి శివకుమార్‌, కప్తానుపాలెం, మోపిదేవి మండలం

మబ్బులు కమ్ముతున్న ఆకాశం కనికరించి నేలపై ఒక్క వర్షపు చుక్కను కూడా రాల్చడం లేదు. నీటి గలగలలతో కళకళలాడాల్సిన పంటకాలువలు చుక్కనీరు లేక ఒట్టిపోయాయి. పచ్చందాలతో కనువిందు చేయాల్సిన సాగు భూములు బీడుగా దర్శనమిస్తున్నాయి. అదునుకొచ్చిన వరి నారు మడులు నీటి తడిలేక ఎండుముఖం పట్టాయి. సాగునీటిపై ప్రభుత్వం స్పష్టతివ్వడం లేదు. ఆరు తడిపంటలు మేలు అంటూ అధికారులు సూచనలతో సరిపెడుతున్నారు. చినుకమ్మా నీవన్నా కరుణించి ఆదుకోమ్మా అంటూ అన్నదాతలు ఆకాశం వైపు దీనంగా చూస్తున్నారు.

చల్లపల్లి / పెనుగంచిప్రోలు: కృష్ణా జిల్లాలో సాధారణంగా జూలై మొదటి వారానికి దాదాపుగా పూర్తి కావాల్సిన వరినాట్లు ఇప్పటికీ ప్రారంభం కూడా కాలేదు. నీటి కోసం పొలాలు రైతుల వైపు చూస్తుంటే.. రైతులు ఆకాశం వైపు చూస్తున్నారు. ప్రకృతి కరుణి స్తుందా? ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం చూపుతుందా? లేక రైతులు మరోసారి అప్పుల ఊబిలో కూరుకుపోతాడా? అన్న ప్రశ్న ఇప్పుడు వ్యవసాయ రంగాన్ని వెంటాడుతోంది. ప్రభుత్వ పెద్దల మాటలు నమ్మి సకాలంలో సాగునీరు వస్తుందని భావించిన రైతులు ఇప్పటికే వేల రూపాయలు ఖర్చు చేసి నారుమడులు సిద్ధం చేసుకున్నారు. తీరా వర్షాలు పడక, కాలువల్లో నీరు అడుగంటడంతో నారుమడిని కాపాడటం, పొలాన్ని తడిపి నాట్లు వేయటం సవాలుగా మారింది.

ఆయిల్‌ ఇంజిన్లతో అదనపు భారం..

కృష్ణా జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 1,65,771 హెక్టార్లలో వివిధ పంటలు సాగవుతాయి. ముఖ్యంగా వరి 1.60,655 హెక్టార్లలో సాగవుతుంది. ఈ ఖరీఫ్‌లో వెద పద్ధతి, బోర్లు, ఇతర నీటి వసతులు ఉన్న ప్రాంతాల్లో 65 వేల హెక్టార్లలో మాత్రమే వరి సాగవుతోంది. వెద పద్ధతిలో సాగుచేసిన పొలాలు నీటి తడులు అందక ఎండిపోతున్నాయి. కొన్ని చోట్ల కాలువల్లో ఉన్న కొద్దిపాటి నీటిని రైతులు ఆయిల్‌ ఇంజిన్లతో తోడి పొలాలకు నీటి తడులు అందిస్తున్నారు. దీనివల్ల రైతులపై మరింత ఆర్థిక భారం పడుతోంది. ఎకరం పొలం తడపటానికి 15 నుంచి 20 గంటల వరకు ఇంజిన్‌ ఆడాల్సి వస్తోంది. ఇందుకు 20 లీటర్ల వరకూ అంటే రూ.2 వేల వరకు ఇంధనం ఖర్చు అవుతోంది. ఆయిల్‌ ఇంజిన్‌కు అద్దె రూ.1000, వాటర్‌ తరలించేందుకు ట్యూబులకు అద్దె, మరోపక్క కూలి ఖర్చులు. ఇలా పొలం తడపటానికే ఖర్చులు తడిసి మోపెడు అవుతున్నాయి.

గత ఏడాది నష్టాల నుంచి తేరుకోకముందే..

గత ఏడాది తుపానులు, భారీ వర్షాలు మిగిల్చిన అప్పులు, కష్టాల నుంచి తాము ఇంకా బయటపడలేదని రైతులు చెబుతున్నారు. తీరా ఈ ఏడాది కూడా ఆదిలోనే హంసపాదు అన్న చందంగా సాగు ప్రారంభంలోనే నీటి కోసం నానా కష్టాలు పడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా నాట్లు కూడా వేయకుండానే ఎకరా పొలం తడపటానికి రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు ఖర్చులు అయ్యాయని వాపోతున్నారు.

ఎండుముఖం పట్టిన పత్తిచేలు

ఎన్టీఆర్‌ జిల్లాలో ఏటా ఖరీఫ్‌లో 48,831 హెక్టార్లలో వరి, 3,727 హెక్టార్లలో మొక్కజొన్న, 75 వేల హెక్టార్లలో పత్తి సాగవుతుంది. వర్షాల జాడలేక బోర్లు, బావులు ఉన్న చోట మాత్రమే రైతులు వరి సాగు చేపట్టారు. మొక్కజొన్న వెయ్యి హెక్టార్ల లోపు మాత్రమే నేటి వరకు సాగయింది. ఈ పంటలను రక్షించుకునేందుకు నీరులేక రైతులు ఇబ్బందిపడుతున్నారు. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, తిరువూరు నియోజకవర్గాల్లో ఇప్పటి వరకు 30 వేల ఎకరాల్లో మాత్రమే పత్తి సాగు చేశారు. మొక్కలు నాటి నెల గడిచినా నీటి తడిలేక పైరు ఎదగలేదు. కొన్ని మొక్కలు ఎండ, గాలులకు వడబడుతున్నాయి. మరో వారం ఇదే పరిస్థితి ఉంటే మొక్కలు మొత్తం ఎండి పోతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఇప్పటికే ఎకరానికి రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు పెట్టుబడులు పెట్టారు. కౌలు రైతులు పరిస్థితి మరింత దారుణంగా ఉంది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నీటి నిల్వ 29.160 టీఎంసీలు. ప్రాజెక్టు దిగువకు విద్యుత్‌ ఉత్పత్తి నిమిత్తం 400 క్యూసెక్కులు వదులుతున్నారు.

కాలువ పక్కనున్న వారు ఇంజిన్లతో నీటిని పెట్టుకుంటున్నారు. కాలువలకు దూరంగా ఉన్న పొలాల్లో సాగు చేసేదెలా? ఇప్పటికీ 90 శాతం నాట్లు పూర్తికావాలి. ఐదు శాతం కూడా పూర్తి కాలేదు. సకాలంలో సాగునీరు ఇస్తే ఈ ఇబ్బంది రైతులకు వచ్చేది కాదు.

– పాగోలు నాగసీతారామరావు, చల్లపల్లి

నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మూడు రోజుల క్రితం ఒక సమావేశంలో మాట్లాడుతూ.. ఆల్‌మట్టి డ్యామ్‌లో నీటి నిల్వ తక్కువగా ఉంది, అక్కడి నుంచి నారాయణపూర్‌, జూరాల రిజర్వాయర్లు నిండిన తర్వాత శ్రీశైలంకు నీరు చేరుకుంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం పులిచింతలలో 30 టీఎంసీలు తప్ప మరే ఇతర రిజర్వాయర్లో తగినంత నీటి నిల్వలు లేవని స్పష్టంచేశారు. పుష్కలంగా వర్షాలు పడితే తప్ప సాగునీరు అందించలేని పరిస్థితి ఏర్పడినట్లు వివరించారు. ఉన్న నీటిని తాగు అవసరాలకు వాడుకోవాలని ఆపై వర్షాలు వస్తే సాగుకు కూడా ఇస్తామని చెప్పుకొచ్చారు. రైతులను ఎక్కువగా ఆరుతడి పండల వైపు మొగ్గుచూపేలా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని కోరారు. దీంతో రైతులు మరింత దిగాలు పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement