రోజువారీ విధుల్లో హిందీ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

రోజువారీ విధుల్లో హిందీ తప్పనిసరి

Jul 23 2026 2:06 AM | Updated on Jul 23 2026 2:06 AM

రోజువారీ విధుల్లో హిందీ తప్పనిసరి

డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా

రైల్వేస్టేషన్‌(విజయవాడపశ్చిమ): కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది రోజువారీ విధుల్లో హిందీ తప్పనిసరి అని డీఆర్‌ఎం మోహిత్‌ సోనాకియా పేర్కొన్నారు. రైల్వే ఆడిటోరియంలో పట్టణ అధికార భాష అమలు కమిటీ (టీఓఎల్‌ఐసీ) సమావేశం బుధవారం జరిగింది. ముఖ్యఅతిథిగా టీఓఎల్‌ఐసీ చైర్మన్‌, డీఆర్‌ఎం మోహిత్‌ సోనా కియా హిందీ ప్రాముఖ్యత, అమలు కోసం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ప్రస్తుత కాలంలో హిందీ నేర్చుకోవడం గతం కంటే చాల సులభమని సూచించారు. ఇటు వంటి కార్యక్రమాలు, పోటీలు అధికారిక ఉత్తర ప్రత్యుత్తరాల్లో హిందీ వినియోగాన్ని పెంచేందుకు దోహదపడతాయని వివరించారు. రాజభాష అమలులో ఉన్నత ప్రమాణాలను సాధించేందుకు డివిజన్‌ నిరంతరం కృషిచేస్తూనే ఉంటుందని తెలిపారు. ఏడీఆర్‌ఎం పి.ఇ.ఎడ్విన్‌ మాట్లాడుతూ.. టీఓఎల్‌ఐసీ సమావేశంలో అన్ని విభాగాలు చురుగ్గా పాల్గొనడం అభినందనీయ మన్నారు. అధికార భాష అమలు, ప్రచారం కోసం రైల్వే చేపడుతున్న పలు కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. అనంతరం సీనియర్‌ రాజభాష అధికారి హేమంత్‌ వాడేకర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా డివిజన్‌లో రాజభాష అమలు పురోగతిని వివరించారు. అనంతరం గత మార్చి పది నుంచి 12వ తేదీ వరకు విజయవాడలో నిర్వహించిన హిందీ ఉపన్యాసం, వ్యాస రచన, కవితా పఠనం, డ్రాఫ్టింగ్‌, వార్త పఠనం, క్విజ్‌, అంత్యా క్షరి పోటీల్లో 45 కేంద్ర ప్రభుత్వ క్యాలయాలకు చెందిన 276 మంది అధికారులు, ఉద్యోగులు పాల్గొనగా 63 మంది విజేతలకు డీఆర్‌ఎం చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement