మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఆధ్వర్యంలో అండర్–19 మహిళల వన్–డే ఇంటర్–జోనల్ టోర్నమెంట్ విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో బుధవారం జరిగింది. ఈ నెల 15 నుంచి ఈ టోర్నమెంట్‌లో భాగంగా మ్యాచ్‌లు జరుగుతున్నాయి. చివరి లీగ్ మ్యాచ్ బుధవారం నిర్వహించారు. అనంతపురం జిల్లా జట్టు, కృష్ణాజిల్లా జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. అనంతపురం జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుని 50 ఓవర్లల్లో 166/5 స్కోర్ చేసింది. తర్వాత కృష్ణా జిల్లా జట్టు బ్యాటింగ్ చేసి 42.1 ఓవర్లలో 169/4 స్కోర్ చేసింది. 6 వికెట్ల తేడాతో 0.808 రన్ రేట్‌తో ఏసీఏ ఇంటర్ జోనల్ మ్యాచ్ చాంపియన్‌గా కృష్ణా జిల్లా జట్టు నిలిచింది.


