చేపల ఫిజికల్ కండీషన్‌కు మద్యమే మందా? ఫలించిన ఆక్వా రైతుల సరికొత్త ఐడియా
కృత్తివెన్ను: మద్యం కిక్కుకు మనిషే కాదు జలపుష్పాలు (చేపలు) సైతం ఖుషీ అవుతాయంటున్నారు కొందరు ఆక్వా రైతులు. ఆక్వాసాగులో భాగంగా చేపలు పెంచుతున్న రైతులు పట్టుబడి సమయంలో చేపల ఫిజికల్ కండీషన్‌కు మద్యం ఎంతగానో ఉపకరిస్తోందంటున్నారు. పట్టుబడి చేసే ముందు చేపలను కొంతసేపు వలల్లో ఉంచుతారు. ఆ సమయంలో ఒక్కోసారి ఆక్సిజన్ లెవల్స్ పడిపోయి చేపలు చనిపోవడం లేదా నీరసించి పోవడం జరుగుతుంది. గతంలో ఈ సమస్యను అధిగమించడానికి ఆక్సిజన్ టాబ్లెట్లు లేదా పౌడర్‌ను వినియోగించేవారు. కానీ ఇప్పుడు వాటి అవసరం లేకుండానే మద్యాన్ని చేపలు ఉన్న వలల్లో పిచికారీ చేయడంతో ఆక్సిజన్ లెవల్స్ పెరగడమే కాదు చేపల్లో మంచి హుషారు కనిపిస్తోందని రైతులు అంటున్నారు. ఏది ఏమైనా మద్యం కిక్కుకు మనిషే కాదండోయ్ చేపలు కూడా చిందులు వేస్తాయంటున్నారు కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలంలోని ఆక్వా రైతులు.


