మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విశాఖ పట్నంలోని ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో ఈ నెల 18, 19 తేదీల్లో జరిగిన 11వ ఏపీ సబ్–జూనియర్, జూనియర్ అంతర్–జిల్లా జల క్రీడల చాంపియన్‌షిప్‌లో ఎన్టీఆర్ జిల్లాకు చెందిన క్రీడాకారులు అద్భుతమైన ప్రతిభ చూపి 231 పాయింట్లతో ఓవరాల్ రన్నరప్‌గా నిలిచారు. అండర్–16 బాలికల విభాగంలో వడ్లమూడి లిపి ఐదు బంగారు పతకాలు, అండర్–14 బాలుర విభాగంలో ఎం.రామ్‌మణి కంఠ–5 బంగారు పతకాలు పొంది వ్యక్తిగత చాంపియన్ షిష్‌ను సొంతం చేసుకున్నారని ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ కార్యదర్శి రమేష్ తెలిపారు. గ్రూప్–1(ఏ)బాలుర విభాగంలో కె.శక్తిదార్–1 బ్రాంజ్, గ్రూప్–1(బి)–బాయ్స్ విభాగంలో బి.పృఽథ్వీరాజ్–3 బంగారు, 1 సిల్వర్,1 బ్రాంజ్ పతకాలు, గ్రూప్–1(బి) బాలికల విభాగంలో వడ్లమూడి లిపి–5 బంగారు, పి.రమ్యశ్రీ–2 బంగారు, 3 సిల్వర్‌పతకాలు, గ్రూప్–2 బాయ్స్ విభాగంలో ఎం.రామ్‌మణికంఠ–5 గోల్డ్, ఎం.హర్షిత్–1 గోల్డ్, 2 సిల్వర్, 2 బ్రాంజ్, గ్రూప్–2 బాలికల విభాగంలో యానా జైన్–2బంగారు, 3 సిల్వర్, కె.సింధుజ–1సిల్వర్, 2 బ్రాంజ్, గ్రూప్–3 బాలుర విభాగంలో జి.జతిన్–1సిల్వర్,2–బ్రాంజ్, గ్రూప్–3 బాలికల విభాగంలో ఎం.జీసాశ్రీ–2 సిల్వర్, 2 బ్రాంజ్ పతకాలు పొందారని రమేష్ తెలియజేశారు. 18 బంగారు పతకాలు, 13 సిల్వర్, 9–బ్రాంజ్ పతకాలు పొంది మొత్తం 231 పాయింట్లతో ఓవరాల్ రన్నరప్‌గా నిలిచారన్నారు. పతకాలు పొందిన క్రీడాకారులను ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కొంగర రవికాంత్, ఏపీ అమెచ్యూర్ ఆక్వాటిక్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఎం.ఓబుల్‌రెడ్డి, ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ సభ్యులు కొడాలి రమేష్, డీఎన్‌డీ కుమార్ అభినందించారు.


