యోగాంధ్రలో పాల్గొన్న యువతకు ప్రశంసా పత్రాలు | - | Sakshi
Sakshi News home page

యోగాంధ్రలో పాల్గొన్న యువతకు ప్రశంసా పత్రాలు

Jul 19 2026 2:14 AM | Updated on Jul 19 2026 2:14 AM

యోగాంధ్రలో పాల్గొన్న యువతకు ప్రశంసా పత్రాలు గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర –2026 కార్యక్రమంలో పాల్గొన్న యువతకు ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమం ఎన్టీఆర్‌ జిల్లా కలెక్టరేట్‌లో శనివారం జరిగింది. కలెక్టర్‌ జి.లక్ష్మీశ, జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌.ఇలక్కియ యువతకు ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లా నుంచి 15,300 మంది విద్యార్థులు, యువత, యోగా సంస్థలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొని జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారని పేర్కొన్నారు. యోగాంధ్ర విజయవంతానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, ఆర్డీఓ వెన్నెల శ్రీను, యువజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి కొల్లేటి రమేష్‌, జిల్లా ఆయుష్‌ అధికారి డాక్టర్‌ వై.రత్నప్రియదర్శిని, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కోటేశ్వర రావు పాల్గొన్నారు. అధికారులతో సీఎం చంద్రబాబు గ్రూప్‌ ఫొటో గుడివాడరూరల్‌: గుడివాడ ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించిన స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమం ముగిసిన తర్వాత కృష్ణా జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం జిల్లా అధికారులతో కలసి సీఎం గ్రూప్‌ ఫొటో దిగారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌ డి.కె.బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు, జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌, జెడ్పీ సీఈఓ అరుణ, ఆర్డీఓ జి.సుబ్రహ్మణ్యం, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. అంబేడ్కర్‌ కన్వెన్షన్‌ హాల్‌ పరిశీలన కృష్ణలంక(విజయవాడతూర్పు): నగరంలోని అంబేడ్కర్‌ కన్వెన్షన్‌ హాల్‌ను ఏడీజీ మధుసూదన్‌రెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ ఎస్‌.వి.రాజశేఖర బాబు శనివారం పరిశీలించారు. మానవ వనరులు, సాంకేతికత ఆధారిత, నిర్మాణాత్మక సంస్కరణల ద్వారా భవిష్యత్‌ నేరాల కట్టడి కోసం ఏపీ పోలీసులను పునర్వవస్థీకరించే లక్ష్యంతో ఈ నెల 22, 23 తేదీల్లో ‘ఫ్యూచర్‌ – రెడీ ఏపీ పోలీస్‌’ వర్క్‌షాప్‌ అంబేడ్కర్‌ కన్వెన్షన్‌ హాల్‌లో నిర్వహిస్తామని ఏడీజీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. వర్క్‌షాప్‌ నిర్వహణ సన్నాహాల నేపథ్యంలో పోలీస్‌ కమిషనర్‌తో కలిసి కన్వెన్షన్‌ హాల్‌తో పాటు పరిసరాలను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు, సల హాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీఐజీ పకీరప్ప, డీసీపీలు కృష్ణకాంత్‌పటేల్‌, షిరీన్‌ బేగం, డాక్టర్‌ కె.తిరుమలేశ్వరరెడ్డి, కె.జి.వి.సరిత, బి.లక్ష్మీనారాయణ, పలువురు ఏడీసీపీలు, ఏసీపీలు తదితరులు పాల్గొన్నారు. రేపు జాబ్‌ మేళా

మచిలీపట్నంఅర్బన్‌: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 20వ తేదీ (సోమవారం) మచిలీపట్నంలోని నోబుల్‌ డిగ్రీ కళాశాలలో నిర్వహించనున్న జాబ్‌మేళాను వినియోగించుకోవాలని కృష్ణా కలెక్టర్‌ డి.కె.బాలాజీ ఒక ప్రకటనలో కోరారు. శ్రీరామ్‌ ఫైనాన్స్‌, ఎస్‌ఎస్‌వీ సొల్యూషన్స్‌, ఇన్నోవ్‌సోర్స్‌, జస్ట్‌ డయల్‌ లిమిటెడ్‌, రాండ్‌స్టాడ్‌, వరుణ్‌ మోటార్స్‌, ఆర్‌ఆర్‌ ట్రేడర్స్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరర్స్‌, టికోనా ఇన్‌ఫినెట్‌, టాటా ఎలక్ట్రానిక్స్‌, ఎంఆర్‌ఎఫ్‌ లిమిటెడ్‌, టీవీఎస్‌, వసంత, ఫ్లిప్‌కార్ట్‌, బ్లింకిట్‌, మ్యాన్‌పవర్‌, డైకిన్‌, డిక్సన్‌ తదితర ప్రముఖ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఉద్యోగాలకు 10వ తరగతి, ఇంటర్మీడియెట్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, ఫార్మసీ పూర్తి చేసిన 18 నుంచి 35 సంవత్సరాల మధ్య వయసున్న అభ్యర్థులు అర్హులని వివరించారు. జాబ్‌ మేళాకు బయోడేటా, ఆధార్‌ కార్డు, ఆధార్‌కు అనుసంధానమైన మొబైల్‌ నంబర్‌, పాన్‌ కార్డు, విద్యార్హతల ధ్రువపత్రాల జిరాక్స్‌ ప్రతులతో హాజరు కావా లని కోరారు. మరిన్ని వివరాలకు 81424 16211, 99664 89796 నంబర్లను సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement