సీనియారిటీ జాబితాలో తప్పులు సరిదిద్దాలి | - | Sakshi
Sakshi News home page

సీనియారిటీ జాబితాలో తప్పులు సరిదిద్దాలి

Jul 18 2026 9:45 AM | Updated on Jul 18 2026 9:45 AM

సీనియారిటీ జాబితాలో తప్పులు సరిదిద్దాలి

యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.ఎ.ఉమామహేశ్వరరావు

మచిలీపట్నంఅర్బన్‌: ఉపాధ్యాయుల స్థానిక క్యాడర్‌ నిర్ణయ ప్రక్రియలో సీనియారిటీకి ఎలాంటి భంగం కలగకుండా జాబితాలో తప్పులు సరిదిద్దాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి కె.ఎ.ఉమామహేశ్వరరావు కోరారు. ఈ మేరకు శుక్రవారం కృష్ణాజిల్లా విద్యాశాఖాధికారి యు.వి.సుబ్బారావుకు యూటీఎఫ్‌ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక క్యాడర్‌ నిర్ణయానికి రూపొందించిన సీనియారిటీ జాబితాలో ఉన్న తప్పులను ఆధారాలతో పరిశీలించి సరిదిద్దాలని కోరారు. ఉపాధ్యాయుల సీనియారిటీకి ఎలాంటి నష్టం కలగకుండా పారదర్శకంగా స్థానిక క్యాడర్‌ నిర్ణయ ప్రక్రియను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.డి.షౌకత్‌ హుస్సేన్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి బి.కనకారావు, జిల్లా గౌరవాధ్యక్షుడు జె.లెనిన్‌ బాబు, జిల్లా కార్యదర్శి కె.రంగనాథ్‌, జిల్లా ఆడిట్‌ కమిటీ సభ్యుడు జె.ప్రసాదరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు పి.రవి వరప్రసాద్‌, అబ్దుల్‌ వహీద్‌, పి.పాపయ్య, శివకుమార్‌, కె.అర్జున్‌, వి.వి.ఎస్‌. సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఉప్పాల నాంచారయ్య, వై.సత్యనారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement