ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల
ప్రిన్సిపాల్ డాక్టర్ ఏడుకొండలరావు
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆధునిక వైద్య రంగంలో ప్లాస్టిక్, రీ కన్‌స్ట్రక్టివ్ సర్జరీలు అత్యంత కీల కంగా మారినట్లు ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆలపాటి ఏడుకొండలరావు పేర్కొ న్నారు. ప్రమాదాలు, కాలిన గాయాలు, జన్యుపరమైన లోపాలు, క్యాన్సర్ వంటి కారణాలతో అవయవాలు దెబ్బతిన్న రోగులకు తిరిగి రూపాన్ని, పని తీరును అందించడంలో ప్లాస్టిక్ , రీకనస్ట్రక్టివ్ సర్జన్స్ విశేష సేవలు అందిస్తున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ప్రపంచ ప్లాస్టిక్ సర్జరీ దినోత్సవాన్ని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాల ప్లాస్టిక్ అండ్ రీకన్‌స్ట్రక్టివ్ సర్జరీ విభాగం ఆధ్వర్యంలో బుధ వారం నిర్వహించారు. ఈ సందర్భంగా శస్త్రచికిత్స పితామహుడిగా పేరుగాంచిన సుశ్రుతుడి చిత్ర పటం వద్ద పుష్పాంజలి ఘటించారు. అనంతరం ప్లాస్టిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ ఏఆర్‌సీహెచ్ మోహన్ మాట్లాడుతూ.. తమ విభాగం సాధించిన విద్య, వైద్య విజయాలను వివరించారు. అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జ్యోత్స్న పోలదాస్ తమ విభాగంలో అందిస్తున్న సేవలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఫైనలియర్ ఎంబీబీఎస్ విద్యార్థులతో పాటు, ఆ విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జాడ మాబు తదితరులు పాల్గొన్నారు.


