దుర్గమ్మ నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం | - | Sakshi
Sakshi News home page

దుర్గమ్మ నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం

Jul 16 2026 7:18 AM | Updated on Jul 16 2026 7:18 AM

దుర్గమ్మ నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి హైదరాబాద్‌కు చెందిన భక్తులు బుధవారం రూ.లక్ష విరాళం సమర్పించారు. హైదరాబాద్‌ దిల్‌షుక్‌నగర్‌కు చెందిన వై.శ్రీనివాసరెడ్డి కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. శ్రీనివాసరెడ్డి కుటుంబం ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.1,01,116 విరాళాన్ని అందజేసింది. హైదరాబాద్‌ ఎల్‌బీ నగర్‌ నాగోలుకు చెందిన జి.వెంకట అజయ్‌ పేరిట అతని తల్లిదండ్రులు భారతి, సత్యనారాయణ దుర్గమ్మకు 374 గ్రాముల వెండి గిన్నె కానుకగా సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ డీఈఓ కిషోర్‌ కుమార్‌ అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. ఎన్టీఆర్‌ జిల్లాలో 99.83 శాతం డిజిటలైజేషన్‌ పూర్తి రాష్ట్రంలో ఆయుష్‌ డిస్పెన్సరీల ఆధునికీకరణ వృత్తి విద్యా కోర్సులపై యువత దృష్టి పెట్టాలి మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యువత వృత్తి విద్యాకోర్సులపై దృష్టి పెట్టడం ద్వారా వారు జీవనోపాధి పొందడమే కాకుండా మరి కొంత మందికి ఉపాధి చూపించవచ్చని ఎన్టీఆర్‌ జిల్లా సహాయక నిపుణ్యాభివృద్ధి అధికారి బి.కిరణ్‌కుమార్‌ పేర్కొన్నారు. స్థానిక రావిచెట్టు సెంటర్‌లో ఉన్న జనశిక్షణ సంస్థాన్‌ కార్యాలయం ఆవరణలో ప్రపంచ యవజన నైపుణ్య దినోత్సవం సందర్భంగా బుధవారం సదస్సు జరిగింది. ఈ సందర్భంగా కిరణ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రభుత్వం స్కిల్‌ హబ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసి యువతలోని స్కిల్స్‌ను పెంపొందిస్తున్నారని చెప్పారు. జనశిక్షణ సంస్థాన్‌ డైరెక్టర్‌ ఏ.పూర్ణిమ మాట్లాడుతూ వృత్తి విద్యా కోర్సులను నేర్చుకున్న వారు ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహకాలను అందిపుచ్చుకుని సొంతంగా యూనిట్‌లను స్థాపించవచ్చని వివరించారు. వరల్డ్‌ యూత్‌ స్కిల్‌ డే పోస్టర్‌ను ఆవిష్కరించారు.

గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): ఎన్టీఆర్‌ జిల్లాలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌)లో ఎన్యూమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ 99.83 శాతం పూర్తయిందని కలెక్టర్‌ డాక్టర్‌ జి.లక్ష్మీశ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 17,13,445 మంది ఓటర్లకు ఏడు నియోజకవర్గాల్లో నూరు శాతం ఫారాల పంపిణీ పూర్తయిందని పేర్కొన్నారు. 99.83 శాతం డిజిటలైజేషన్‌ ప్రక్రియ పూర్తయిందని వివరించారు. విజయవాడలోని మూడు నియోజకవర్గాలు ఈస్ట్‌, వెస్ట్‌, సెంట్రల్‌, జగ్గయ్యపేటలో నూరు శాతం డిజిటలైజేషన్‌ పూర్తయిందన్నారు. తిరువూరులో 99.75 శాతం, మైలవరం 99.89 శాతం, నందిగామ 99.03 శాతం పూర్తయినట్లు కలెక్టర్‌ వివరించారు.

భవానీపురం (విజయవాడ పశ్చిమ): ఆయుర్వేద, యునాని, నేచురోపతి కళాశాలలు, ఇంటి గ్రేటెడ్‌ ఆస్పత్రులతో ప్రాచీన వైద్యానికి పునర్వైభవం తీసుకొస్తామని, అందులో భాగంగా 1,500 ఆయుష్‌ డిస్పెన్సరీలను రూ.414 కోట్ల వ్యయంతో ఆధునికీకరించనున్నామని మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ పేర్కొన్నారు. ఔషధ మొక్కల స్థిరమైన సాగు, మార్కెటింగ్‌, మౌలిక సదుపాయాలపై బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన రాష్ట్ర సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. రూ.280 కోట్లతో నాలుగు కొత్త ఆయుష్‌ మెడికల్‌ కళాశాలలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఔషధ, సుగంధ మొక్కలను ప్రోత్సహించేందుకు రూపొందించిన వెబ్‌సైట్‌ను మంత్రి ఆవిష్కరించారు. అనంతరం రైతులకు ఔషధ, సుగంధ మొక్కల విత్తనాలను పంపిణీ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement