పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో సత్తా | - | Sakshi
Sakshi News home page

పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో సత్తా

Jul 16 2026 7:18 AM | Updated on Jul 16 2026 7:18 AM

మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): విజయవాడలోని ఎస్‌టీవీఆర్‌ స్కూల్‌ ఆవరణలో ఈ నెల 11, 12 తేదీల్లో జరిగిన పురుషులు, మహిళల రాష్ట్రస్థాయి పవర్‌ లిఫ్టింగ్‌ పోటీల్లో తమ కళాశాలకు చెందిన విద్యార్థులు పలు విభాగాల్లో పతకాలు సాధించారని సిద్ధార్థ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎం.రమేష్‌ తెలిపారు. పతకాలు పొందిన విద్యార్థులను కళాశాల ఆవరణలో బుధవారం అభినందించారు. రమేష్‌ మాట్లాడుతూ 53 కేజీల విభాగంలో టి.భాను ప్రసాద్‌, 66 కేజీల విభాగంలో ఈ.వేణు, 59 కేజీల విభాగంలో ఐ.శివరామస్వామి, 74 కేజీల విభాగంలో వై.హర్షిత్‌, 63 కేజీల విభాగంలో బి.లిఖిత బంగారు పతకాలు సాధించారన్నారు. వీరితో పాటుగా 66 కేజీల విభాగంలో పవన్‌ సతీష్‌, 59 కేజీల విభాగంలో సీహెచ్‌ కృష్ణ సిల్వర్‌ మెడల్స్‌, 59 కేజీల విభాగంలో ఎస్‌.రోహిత్‌ రెడ్డి బ్రాంజ్‌ మెడల్‌ సాధించారని చెప్పారు. గోల్డ్‌ మెడల్‌ సాధించిన ఐదుగురు విద్యార్థులు జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యారన్నారు. విద్యార్థులను కళాశాల డైరెక్టర్‌ వేమూరి బాబూరావు, కోచ్‌ శ్యామ్‌, కళాశాల స్పోర్ట్స్‌ హెచ్‌వోడీ డాక్టర్‌ బాలకృష్ణారెడ్డి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement