కానూరు సబ్‌స్టేషన్‌ అప్‌గ్రేడ్‌నకు చర్యలు | - | Sakshi
Sakshi News home page

కానూరు సబ్‌స్టేషన్‌ అప్‌గ్రేడ్‌నకు చర్యలు

May 29 2026 8:04 AM | Updated on May 29 2026 8:04 AM

పెనమలూరు: కానూరు కొత్తఆటోనగర్‌ సబ్‌స్టేషన్‌ను అప్‌గ్రేడ్‌ చేయటానికి ఏపీసీడీసీఎల్‌ చైర్మన్‌ ఆండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పి.పుల్లారెడ్డి ఆమోదించారని ఈఈ ఆపరేషన్స్‌ పి.హరిబాబు తెలిపారు. ఈ మేరకు గురువారం సీఎండీ పుల్లారెడ్డి, ప్రాజెక్ట్స్‌ డైరెక్టర్‌ వీఎస్‌ఎన్‌.మూర్తి ఆటోనగర్‌ సబ్‌స్టేషన్‌ను పరిశీలించారన్నారు. ఈ ఈ హరిబాబు వివరాలు తెలుపుతూ కానూరు ఆటోనగర్‌ 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ పై విపరీతంగా లోడ్‌ పడుతున్నందున సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకోని రూ 125 కోట్లతో కానూరు ఆటోనగర్‌ సబ్‌స్టేషన్‌ను 132 కేవీ సబ్‌స్టేషన్‌ను అప్‌గ్రేడ్‌ చేస్తామన్నారు. దీంతో గంగూరులో ఉన్న 132 కేవీ సబ్‌స్టేషన్‌పై లోడ్‌ గణనీయంగా తగ్గుతుందన్నారు. పెనమలూరు, పోరంకి, తాడిగడప తదితర ప్రాంతా లోడ్‌ తగ్గి నాణ్యమైన విద్యుత్‌ సరఫరా జరుగుతుందని వివరించారు. కాగా పెదపులిపాక కరకట్ట దిగువున 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మించటానికి అధికారులు స్థలం పరిశీలించారు.పెదపులిపాక, యనమలకుదుఉఉ గ్రామాలకు మెరుగైన విద్యుత్‌ సరఫరా చేయటానికి నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ హనుమయ్య, విద్యుత్‌ శాఖ డీఈలు,ఏఈలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement