మహోన్నత వ్యక్తి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ | - | Sakshi
Sakshi News home page

మహోన్నత వ్యక్తి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌

Apr 15 2026 8:44 AM | Updated on Apr 15 2026 8:44 AM

తోట్లవల్లూరు: ప్రపంచం గర్వించదగ్గ మహోన్నత వ్యక్తి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ అని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, పామర్రు మాజీ ఎమ్మెల్యే కై లే అనిల్‌కుమార్‌ అన్నారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా మండలంలోని యాకమూరు, తోట్లవల్లూరులో అంబేడ్కర్‌ విగ్రహాలకు అనిల్‌కుమార్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రొయ్యూరులో నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ విగ్రహాన్ని వైఎస్సార్‌ సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కై లే జ్ఞానమణితో కలిసి ఆయన ఆవిష్కరించారు. జెడ్పీటీసీ సభ్యుడు జొన్నల రామ్మోహన్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు కళ్లం వెంకటేశ్వరరెడ్డి, వైస్‌ ఎంపీపీలు కళ్లం శివారెడ్డి, మెల్లంపల్లి వెంకటేశ్వరరావు, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చింతలపూడి గవాస్కర్‌రాజు, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నడకుదురు రాజేంద్ర, మాజీ సర్పంచ్‌లు నిమ్మగడ్డ ప్రభుదాస్‌, దాసరి సుందరకుమార్‌, నాయకులు రామచంద్రరావు, శేషిరెడ్డి, వాసు, సురేంద్రరెడ్డి, కోటేశ్వరరావు, రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement