పూర్తిస్థాయిలో బూత్‌ ఏజెంట్లను నియమించండి | - | Sakshi
Sakshi News home page

పూర్తిస్థాయిలో బూత్‌ ఏజెంట్లను నియమించండి

Apr 14 2026 8:52 AM | Updated on Apr 14 2026 8:52 AM

పూర్తిస్థాయిలో బూత్‌ ఏజెంట్లను నియమించండి

చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రతి పోలింగ్‌ కేంద్రానికి బూత్‌ స్థాయి ఏజెంట్లను నియమించాలని కృష్ణా కలెక్టర్‌ డీకే బాలాజీ సూచించారు. కలెక్టరేట్‌లోని ఆయన చాంబర్‌లో సోమవారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలో 1,769 పోలింగ్‌ కేంద్రాలకు బూత్‌స్థాయి ఏజెంట్లను నియమించాలన్నారు. రానున్న సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు పూర్తిస్థాయిలో ఏజెంట్లను నియమించి సంబంధిత నియోజకవర్గాల ఓటర్ల నమోదు అధికారికి పంపాలన్నారు.

భారత ఎన్నికల సంఘం బూత్‌ స్థాయి ఏజెంట్లకు త్వరలో శిక్షణ ఇవ్వనుందన్నారు. ఇంటింటికీ తిరిగి స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారీకి తోడ్పాటును అందించాలన్నారు. జిల్లాలో ఫారం 6, 7, 8 క్లయిమ్‌లకు సంబంధించి 86,313 దరఖాస్తులు వచ్చాయని వీటిలో 84,354 పరిష్కరించాలన్నారు. మిగిలిన దరఖాస్తుల పరిష్కారం వివిధ దశల్లో ఉందన్నారు. జిల్లాలో 2002 ఓటర్ల జాబితాను, 2025 ఓటర్ల జాబితాతో ప్రత్యేక తీవ్రతర ఓటర్ల జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) మ్యాపింగ్‌ 69 శాతం పూర్తి చేశామన్నారు. సమావేశంలో డీఆర్వో కె.చంద్రశేఖరరావు, పార్టీల ప్రతినిధులు షేక్‌ సలార్‌దాదా, పీవీ గజేంద్ర, కొడాలి శర్మ, ఆసిఫ్‌బాషా, బాలాజీ ఉన్నారు.

రాజకీయ పార్టీల ప్రతినిధులతో

కృష్ణా కలెక్టర్‌ బాలాజీ

Advertisement
 
Advertisement
Advertisement