అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి | - | Sakshi
Sakshi News home page

అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి

Apr 7 2026 9:31 AM | Updated on Apr 7 2026 9:31 AM

● మచిలీపట్నం జిల్లా కోర్టు సెంటర్‌, శిడింబి అగ్రహారానికి చెందిన ఎన్‌. రాధిక తన కవల పిల్లలు అంగవైకల్యం కలిగి ఉన్నారని, వారిలో ఒకరు 90 శాతం వికలాంగుడని, వారి పోషణ కష్టంగా మారిందని తెలియజేస్తూ పింఛను మంజూరుకు విన్నవించారు. ● నార్త్‌ మండలం నూరుద్దీన్‌పేటకు చెందిన బేగ్‌ షాహినా గతంలో మంజూరైన ఇంటి స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు. ● చిలకలపూడికి చెందిన కె. రామచంద్రరావు నగరంలోని సర్కారుతోట వద్ద ప్రభుత్వ పార్కు స్థలాన్ని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకుని భూమిని స్వాధీనం చేసుకోవాలని ఫిర్యాదు చేశారు.

‘మీ కోసం’లో కలెక్టర్‌ డీకే బాలాజీ

మచిలీపట్నంఅర్బన్‌: ‘మీ కోసం’ కార్యక్రమంలో వచ్చే ప్రతి అర్జీదారునికి శాశ్వత పరిష్కారం అందేలా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని కలెక్టర్‌ డీకే బాలాజీ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్‌ఎస్‌ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీ కోసం’ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి జాయింట్‌ కలెక్టర్‌ ఎం. నవీన్‌ కుమార్‌, డీఆర్‌ఓ కె. చంద్రశేఖరరావు, విజిలెన్స్‌ డెప్యూటీ కలెక్టర్‌ పోతు రాజు, బందరు ఇన్‌చార్జ్‌ డీఎస్పీ ధర్మేంద్రతో కలిసి కలెక్టర్‌ అర్జీలు స్వీకరించారు.

యంత్రాంగం ప్రధాన బాధ్యత ఇదే..

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజా సమస్యలను వేగవంతంగా, పారదర్శకంగా పరిష్కరించడం ప్రభుత్వ యంత్రాంగం ప్రధాన బాధ్యత అని తెలిపారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆశతో కలెక్టరేట్‌కు వస్తారని, అందువల్ల ప్రతి అర్జీని సున్నితంగా, బాధ్యతతో, మానవతా దక్పథంతో పరిశీలించాలని సూచించారు. కేవలం అర్జీ స్వీకరణతో సరిపెట్టకుండా సమస్య స్వభావాన్ని అర్థం చేసుకుని, ఫీల్డ్‌ స్థాయిలో పరిశీలన జరిపి, సమగ్రంగా పరిశీలించి తగిన పరిష్కారం చూపాలని అధికారులకు ఆదేశించారు. అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని, జాప్యం లేదా నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. ట్రైనీ డెప్యూటీ కలెక్టర్‌ నిఖిల, ఆర్‌అండ్‌బీ ఈఈ లోకేశ్వరరావు, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు ఎన్‌. పద్మావతి, జె. జ్యోతి, డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ యుగంధర్‌, మత్స్య శాఖ అధికారి అయ్య నాగరాజు, జిల్లా సహకార అధికారి చంద్రశేఖర్‌ రెడ్డి, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ టి. శివరాం ప్రసాద్‌, డీఎస్‌ఓ జి. మోహన్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

వచ్చిన అర్జీల్లో కొన్ని..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement