రాష్ట్రంలో ఆటవిక పాలన | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో ఆటవిక పాలన

Feb 3 2026 9:47 AM | Updated on Feb 3 2026 9:47 AM

రాష్ట్రంలో ఆటవిక పాలన

రాష్ట్రంలో ఆటవిక పాలన

పామర్రు: రాష్ట్రంలో గత వారం రోజులుగా ఆటవిక రాక్షస పాలనను తలపించే విధంగా కూటమి ప్రభుత్వ పాలన ఉన్నదని వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌ కుమార్‌ చంద్రబాబు ప్రభుత్వ తీరుపై నిప్పులు చెరిగారు. ప్రస్తుతం జరుగుతున్న తిరుమల లడ్డు వివాదం, వైఎస్సార్‌ సీపీ నాయకులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో పార్టీ శ్రేణులతో కలిపి సోమవారం ఫిర్యాదు చేశారు. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి పోలీస్‌ స్టేషన్‌ వరకు భారీ ర్యాలీగా పార్టీ నేతలతో కలిసి వెళ్లి పామర్రు ఎస్‌ఐ రాజేంద్ర ప్రసాద్‌కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం స్టేషన్‌ వద్ద అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ కూటమి హయాంలో తీసిన శాంపిల్స్‌కి జగన్‌ హయాంలో కల్తీ జరిగిందని చంద్రబాబు చెప్పడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. అసత్యమైన ఆరోపణలతో ప్రజల్లో మత విద్వేషాలు కల్గించేలా గ్రామాల్లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసిన కూటమి ప్రభుత్వ నాయకులపై తగిన చర్యలు తీసుకోవాలంటూ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.

నాయకులపై దాడులు దుర్మార్గం

వైఎస్సార్‌ సీపీ నాయకులు అంబటి రాంబాబు, విడదల రజిని, జోగి రమేష్‌లపై టీడీపీ నాయకులు దాడులు చేయడం దుర్మార్గపు చర్య అని కై లే అనిల్‌కుమార్‌ అన్నారు. వందల మంది టీడీపీ నాయకులు కట్టెలతో, రాడ్లతో వైఎస్సార్‌ సీపీ నాయకులపై దాడులు చేయటం దుర్మార్గమని అన్నారు. గ్రంథాలయ చైర్‌పర్సన్‌గా ఉన్న మహిళ నీచాతి నీచమైన భాషతో మాట్లాడుతుంటే ఆమైపె కేసులు లేవా? దాడులు జరిగిన వారి పైన, ఆర్థికంగా నష్టపోయిన వారిపైన కేసులు పెట్టి జైల్లో పెట్టడం అన్యాయం అన్నారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ ఆరేపల్లి శ్రీనివాసరావు, వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షులు రాజులపాటి రాఘవరావు, కాకర్ల వెంకటేశ్వరరావు, గోగం సురేష్‌, ట్రేడ్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు తాడి శెట్టి శ్రీనివాసరావు, టౌన్‌ అధ్యక్షుడు నందిపాటి సురేష్‌రెడ్డి, ఉప సర్పంచ్‌ దేవిరెడ్డి బాల వెంకటేశ్వరరెడ్డి, పార్టీ రాష్ట్ర రైతు విభాగం కార్యదర్శి కూసం పెద వెంకటేశ్వరరెడ్డి, నాయకులు నామా వెంకేటశ్వరరావు, గవాస్కరరాజు, మద్దుల సుబ్రమణ్యం, ఎ.శ్రీనాఽథ్‌రెడ్డి, ప్రసాద్‌, బీవీ రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కై లే అనిల్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement