ప్రాధాన్యతాక్రమంలో సమస్యలు పరిష్కరిస్తాం
మీకోసంలో ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు
కోనేరుసెంటర్: ప్రజా సమస్యలను ప్రాధాన్యతాక్రమంలో పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్‌నాయుడు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. పలు అర్జీలను అక్కడికక్కడే పరిష్కరించిన ఆయన మరికొన్ని అర్జీలను సంబంధిత అధికారులకు సిఫార్సు చేసి వెంటనే వాటిని పరిష్కరించాలని ఆదేశించారు. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించినా నిర్లక్ష్యం ప్రదర్శించినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి సమస్యను చట్టపరిధిలో ఒకటికి పదిమార్లు పరిశీలించి బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. మీకోసంలో మొత్తం 36 ఫిర్యాదులు అందినట్లు ఆయన తెలిపారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు పలువురు భక్తులు సోమవారం విరాళాలు అందజేశారు. గుంటూరు జిల్లా స్ధంభాలగరువుకు చెందిన బండ్రెడ్డి దుర్గా పవన్ కుటుంబం అమ్మవారి ఉచిత ప్రసాద వితరణకు రూ.1,00,001 విరాళాన్ని ఆలయ ఏఈవో వెంకటరెడ్డికి అందజేశారు. విజయవాడ హనుమాన్ పేటకు చెందిన ఆలపాటి మారుతీరామ్ దంపతులు ఆలపాటి రామారావు, శాంత పద్మకుమారి పేరిట నిత్యాన్నదానానికి రూ.1,10,116 విరాళాన్ని ఆలయ సూపరింటెండెంట్ డీవీవీ సత్యనారాయణకు అందజేశారు. హైదరాబాద్ దిల్‌షుక్‌నగర్‌కు చెందిన గంజి ప్రసాద్ యాదవ్ కుటుంబానికి చెందిన గంజి కొండయ్య యాదవ్ ఆలయ అధికారులను కలిసి నిత్యాన్నదానానికి రూ.లక్ష విరాళాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
ప్రాధాన్యతాక్రమంలో సమస్యలు పరిష్కరిస్తాం


