చిన్నారులపై లైంగిక దాడుల నివారణకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

చిన్నారులపై లైంగిక దాడుల నివారణకు ప్రాధాన్యం

Nov 23 2025 9:29 AM | Updated on Nov 23 2025 9:29 AM

చిన్నారులపై లైంగిక దాడుల నివారణకు ప్రాధాన్యం

చిన్నారులపై లైంగిక దాడుల నివారణకు ప్రాధాన్యం

మచిలీపట్నంఅర్బన్‌: చిన్నారులపై లైంగిక దాడులకు పూర్తిగా ముగింపు పలకడం సమాజం బాధ్యతని, ఈ అంశంపై నిరంతర అవగాహనతోనే సమస్య తగ్గుతుందని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ పి. యుగంధర్‌ తెలిపారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో శనివారం చిన్నారులపై లైంగిక దాడుల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. డిస్ట్రిక్ట్‌ ఎర్లీ ఇంటర్వెన్షన్‌ చైల్డ్‌ సైకాలజిస్టు రత్నకుమారి చిన్నారులు ఎదుర్కొనే ముప్పులు, ప్రమాదాలను గుర్తించే విధానం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అనుసరించాల్సిన జాగ్రత్తలపై వివరంగా అవగాహన కల్పించారు. పిల్లల భద్రతలో కుటుంబం, పాఠశాల, ఆరోగ్య వ్యవస్థలు కలసి పని చేయాల్సిన అవసరాన్ని ఆమె నొక్కిచెప్పారు. కార్యక్రమంలో ఆర్బీఎస్కే అధికారి డాక్టర్‌ హిమబిందు, సోషల్‌ వర్కర్‌ అనంత్‌, సైకాలజిస్ట్‌ సుబ్రహ్మణ్యం, మహిళా, శిశు సంక్షేమ శాఖ లీగల్‌ కేర్‌ ప్రొబేషన్‌ ఆఫీసర్‌ శైలజ, ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ ప్రొటెక్షన్‌ అధికారులు, పోలీసు సిబ్బంది, విద్యాశాఖ, ఐసీడీఎస్‌ సీడీపీఓలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడీ టీచర్లు, ఆరోగ్య శాఖ ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.

డీఎంహెచ్‌ఓ యుగంధర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement