గన్నవరం: గ్రావెల్‌ను అక్రమ రవాణా చేస్తున్న తొమ్మిది టిప్పర్ లారీలను సోమవారం అర్ధరాత్రి గన్నవరం పోలీస్‌లు సీజ్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. విజయవాడ రూరల్ మండలం కొత్తూరు తాడేపల్లి నుంచి అమరావతి రాజధాని ప్రాంతానికి గ్రావెల్ తరలింపు పేరుతో పక్కదారి పట్టిస్తున్న సమాచారం మేరకు పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో మండలంలోని సవారిగూడెం పరిధిలో రియల్ ఎస్టేట్ వెంచర్‌కు గ్రావెల్ మట్టిని తరలిస్తున్న తొమ్మిది టిప్పర్లను గన్నవరం పోలీసులు పట్టుకున్నారు.అనంతరం టిప్పర్లను సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి
Apr 1 2026 8:30 AM | Updated on Apr 1 2026 8:30 AM
ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి
పెడన: పట్టణంలోని 15వ వార్డులో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు తూలి బావిలో పడిపోవడంతో మృతి చెందిన సంఘటన పెడన పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు 15వ వార్డుకు చెందిన వేములవాడ సాయికృష్ణ(45) 15 వార్డులో అద్దె ఇంటిలో నివాసం ఉంటున్నాడు. సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో బావిలో నీరు తోడేందుకు వెళ్లాడు. బావిలో పడిపోయిన శబ్ధం రావడంతో భార్య వరలక్ష్మి చుట్టుపక్కల వారిని పిలిచి సాయికృష్ణను బయటకు తీియడంతో కొన ఊపిరితో ఉండటంతో మచిలీపట్నం ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు. వరలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెడన ఎస్‌ఐ జి.సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. . తొమ్మిది టిప్పర్లు సీజ్ స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ముందంజలో ఉండాలి పటమట(విజయవాడతూర్పు): స్వచ్ఛ సర్వేక్షణ్‌లో విజయవాడ నగరపాలకసంస్థతో పాటు మెంటీ సిటీలు కూడా ముందంజలో ఉండాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్, వీఎంసీ స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ జి.లక్ష్మిశ అన్నారు. వీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ రూమ్‌లో కమిషనర్ ధ్యానచంద్ర ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం స్వచ్ఛ సర్వేక్షణ్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మీశ మాట్లాడుతూ.. సూపర్ స్వచ్ లీగ్ సిటీగా ఉన్న విజయవాడ నగరపాలకసంస్థ, ఆ అవార్డును అలాగే నిలబెట్టుకోవటమే కాకుండా మెంటీ సిటీలైన ఆకివీడు, సామర్లకోట, చింతలపూడి, నర్సాపురం, గొల్లప్రోలు కూడా ముందంజలో ఉంచాలన్నారు. అందుకు వారికి సహకారం అందించి విజయవాడ నగరపాలక సంస్థ వారు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను వారి మున్సిపాలిటీలు, పంచాయతీల్లో కూడా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విజయవాడ నగరంలో కూడా వినూత్న క్యాంపెయిన్లు నిర్వహించి ప్రజలకు స్వచ్ఛతపై మరింత అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్(ప్రాజెక్ట్స్)డాక్టర్ డి.చంద్రశేఖర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె.అర్జునరావు, చీఫ్ సిటీ ప్లానర్ కె.సంజయ్ రత్నకుమార్, చీఫ్ ఇంజినీర్ ఇన్‌చార్జి పి.సత్యకుమారి, సూపరింటెండింగ్ ఇంజినీర్ వర్క్స్ వి.చంద్రశేఖర్, స్వచ్ఛ సర్వేక్షణ్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement


